Friday, 7 August 2026

APలో బర్ద్ ఫ్లూ తో రెండేళ్ల చిన్నారి మృతి

APలో తొలి బర్డ్‌ ఫ్లూ వైరస్ మృతి

పల్నాడు జిల్లా నరసరావుపేటలో రెండు సంవత్సరాల చిన్నారి బర్డ్‌ ఫ్లూ H5N1 వైరస్‌తో మృతిచెందింది. భారత వైద్య పరిశోధన మండలి (ICMR) మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) నిర్ధారించినట్లుగా, చిన్నారి పచ్చి కోడిమాంసం తినడం, అలాగే రోగ నిరోధక శక్తి తగ్గడమే ఈ మృతికి కారణమైందని వైద్యులు తెలిపారు.

బర్డ్‌ ఫ్లూ కారణంగా జరిగిన ఈ మృతి రాష్ట్రంలో తొలి ఘటన. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ సూచించింది. జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ముక్కు కారడం, మూర్ఛ, విరేచనాలు, ఆహారం తినలేని లక్షణాలు కనిపించిన తర్వాత, మార్చి 4న నరసరావుపేట చిన్నారిని మంగళగిరిలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఎయిమ్స్ వైద్యులు చిన్నారికి ఆక్సిజన్ సాయంతో చికిత్స అందించినా, మార్చి 16న ఆమె మృతి చెందింది.

చికిత్స ప్రారంభించిన సమయంలో, మార్చి 7న పాప గొంతు, ముక్కు నుండి తీసిన స్వాబ్ నమూనాలను ఎయిమ్స్‌లోని VRDLలో పరీక్షించినప్పుడు, బర్డ్‌ ఫ్లూ అనుమానంతో నమూనాలను మార్చి 15న ఢిల్లీకి పంపారు. అక్కడ కూడా బర్డ్‌ ఫ్లూ వైరస్ అనుమానం తేలింది. దీనిని గమనించిన ICMR, మార్చి 24న శాంపిల్స్‌ను పూణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించింది. అనంతరం, ఈ రెండు ల్యాబ్స్‌లో చేసిన పరీక్షల ద్వారా, చిన్నారికి H5N1 వైరస్ సోకినట్లు నిర్ధారించారు.

ఈ మరణంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. మృతిచెందిన చిన్నారి ఇంటి చుట్టూ ఆరోగ్యశాఖ సర్వే నిర్వహించింది. అనుమానిత లక్షణాలు ఉన్నవారు ఎవరూ లేరని నిర్ధారించారు.

ఇంట్లో చికెన్ కర్రీ వండుతున్న సమయంలో పాప పచ్చి మాంసం ముక్క తినడం, అదే ప్రమాదం కారణమైందని తల్లిదండ్రులు తెలియజేశారు. ఉడికించిన మాంసం తిన్న తమకు ఎలాంటి సమస్యలు రాలేదని వారు పేర్కొన్నారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు