Friday, 7 August 2026

కంచ గచ్చిబౌలి భూములపై వెంటనే నివేదిక పంపండి: కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్

కంచ గచ్చిబౌలి భూములపై వెంటనే నివేదిక పంపాలని అటవీ శాఖ అధికారులను కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ఆదేశించారని BJP, MPలు వెల్లడించారు. BJP రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్, MPలు DK అరుణ, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, G.నగేశ్, రఘునందన్ రావు మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ను కలిశారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో జోక్యం చేసుకోవాలని వినతిపత్రం అందజేశారు. కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాలు పర్యావరణ, హెరిటేజ్ భూములని తెలిపారు.

హైదరాబాద్ పర్యావరణ పరిరక్షణ సమతుల్యతకు ఈ భూములు ఎంతో ప్రయోజనకరమన్నారు. అనేక రకాల ఔషధ మొక్కలు, వివిధ పక్షి జాతులతో ఆ ప్రాంతమంతా అలరారుతున్నదని చెప్పారు. ఇంతటి విలువైన భూములను రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ గా మార్చి వేల కోట్లు దండుకోవాలని చూస్తున్నదని వారు ఆరోపించారు. HCU విద్యార్థులతో పాటు హైదరాబాద్ ప్రజలంతా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ కు తెలిపారు. వెంటనే కంచ గచ్చిబౌలి భూముల విషయంలో జోక్యం చేసుకుని, ఆ భూములను పరిరక్షించాలని కోరారు. ఇందుకు స్పందించిన కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్, కంచ గచ్చిబౌలి భూములపై వెంటనే రిపోర్ట్ ఇవ్వాలని అటవీ, పర్యావరణ శాఖ అధికారులను ఆదేశించారని MPలు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నివేదిక అందిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని వారు తెలిపారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు