Friday, 7 August 2026

విశాఖపట్టణంలో తల్లీకూతుర్లపై ప్రేమోన్మాది దాడి

నగరంలోని మధురవాడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ప్రేమోన్మాది ఘాతుకానికి ఒడిగట్టాడు. ప్రేమను నిరాకరించిందనే కోపంతో మధురవాడ స్వయంకృషి నగర్‌లో ఈరోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఓ యువతితో పాటు, ఆమె తల్లిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేసి పరారయ్యాడు. ఈ ఘటనలో తల్లి లక్ష్మి మృతిచెందారు. యువతి దివ్యకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం గాయత్రి ఆస్పత్రికి తరలించారు. దాడి చేసిన యువకుడు నవీన్‌గా గుర్తించారు. బాధితురాలు డిగ్రీ పూర్తిచేసి ఇంటి వద్ద ఉంటుందని సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని లక్ష్మి మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

నవీన్ అనే యువకుడు కొంతకాలంగా యువతిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. అయితే ఆమె నిరాకరించడంతో కోపంతో ఊగిపోయిన అతడు, యువతి ఇంటికి వెళ్లి కత్తితో ఆమెతో పాటు ఆమె తల్లిపైనా దాడి చేశాడు. తల్లి లక్ష్మి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందగా, యువతి తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆమె గాయత్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. వైద్యుల ప్రకారం, ఆమె పరిస్థితి ఎలా ఉంటుందో 48 గంటల తర్వాత తెలుస్తుందని పేర్కొన్నారు.

ఈ ఘటనలో యువతి కూడా మరణించిందని కొన్ని వార్తలు వచ్చినప్పటికీ, ACP అప్పలరాజు స్పందిస్తూ యువతికి చికిత్స కొనసాగుతోందని తెలిపారు. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే నిందితుడు పారిపోయాడు. నగర పోలీస్‌ కమిషనర్‌ శంకబ్రత బాగ్చీ, DCP ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘోర ఘటనతో స్వయంకృషి నగర్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు