Friday, 7 August 2026

AP రాజధాని అమరావతి నిర్మాణంలోకి సింగపూర్ తిరిగి ప్రవేశం?

రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు తిరిగి ప్రారంభం అవుతున్నాయి. అమరావతిలో Startup ఏరియా నిర్మాణంలో సింగపూర్ ప్రభుత్వ భాగస్వామ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కోరుతోంది. ఈ మేరకు సింగపూర్ ప్రతినిధి బృందం రాజధానిలో పర్యటిస్తోంది. నిర్మాణాలను బృందం పరిశీలిస్తోంది. గతంలో రాజధాని అమరావతిలో సింగపూర్ స్టార్ట్‌అప్ ఏరియా డెవలప్ చేయడానికి సింగపూర్ కన్సార్టియం 1,900 ఎకరాల భూమిని తీసుకుంది. 2015లో అమరావతి రాజధాని‌గా నిర్ణయించబడిన తర్వాత మాస్టర్ ప్లాన్ ఖరారులో సింగపూర్ కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు మారిన పరిస్థితుల్లో మరోసారి సింగపూర్ బృందం అమరావతికి రావడం ఆసక్తికరంగా మారింది.

అయిదేళ్ల కాలంలో అమరావతిలో మారిన పరిస్థితులు, ఫ్లడ్ కంట్రోల్‌కు తీసుకుంటున్న చర్యలు, కరకట్ట రోడ్డు, ఉద్దండరాయుని పాలెం, తాళ్లాయపాలెంలోని స్టార్ట్‌అప్ ఏరియా, IAS అధికారుల టవర్స్, మంత్రుల నివాస సముదాయాలను సింగపూర్ ప్రతినిధి బృందం పరిశీలించింది. ఉండవల్లి సమీపంలోని వరద నియంత్రణ కోసం నిర్మించిన ఫ్లడ్ పంపింగ్ స్టేషన్‌తో పాటు కృష్ణా కరకట్ట రోడ్డు రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్‌కు సంబంధించిన పనులను సింగపూర్ ప్రతినిధులు చూశారు. మరోవైపు, రాజధానిలోని ఉద్దండరాయునిపాలెం సమీపంలో సీడ్ యాక్సెస్ రహదారిని ఆనుకుని నిర్మించబోయే స్టార్ట్‌అప్ ఏరియాను కూడా పరిశీలించారు. నిర్మాణ పనులకు సంబంధించిన వివరాలను CRDA అధికారులు సింగపూర్ బృందానికి వివరించారు.

సీడ్ క్యాపిటల్ నిర్మాణంలో సింగపూర్ భాగస్వామ్యం ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న దృష్ట్యా ఆ దేశ ప్రతినిధుల బృందం స్థానికంగా పర్యటించింది. రాజధానిలో పర్యటన అనంతరం CS విజయానంద్‌తో సింగపూర్ ప్రతినిధుల బృందం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో CRDA, మున్సిపల్ శాఖ అధికారులు పాల్గొని వివిధ అంశాలపై చర్చించారు. అమరావతి నిర్మాణానికి సంబంధించి గతంలోలాగే సింగపూర్ ప్రభుత్వం రాష్ట్రానికి సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల మూడో వారంలో ప్రధాని మోదీ అమరావతి పనుల రీ లాంచ్‌కు రానున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీంతో నిర్మాణ పనులు వేగం పెరగనుంది. 2027 నాటికి తొలి దశ నిర్మాణ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు.


ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు