Friday, 7 August 2026

ఆంధ్రప్రదేశ్ లో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు

రాష్ట్రంలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లో NDA కూటమి అధికారంలోకి వచ్చాక మద్యం ధరలు తగ్గించడం, నాణ్యమైన మద్యం సరఫరా పై దృష్టి సారించడం ద్వారా మద్యం సేల్స్ మరో స్థాయికి తీసుకెళ్లినట్లు పేర్కొంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి నాన్-డ్యూటీ పేయిడ్ లిక్కర్ రాకుండా ఎక్సైజ్ శాఖ పటిష్ట చర్యలు తీసుకోవడంతో మద్యం అమ్మకాలు భారీగా పెరిగినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో మద్యం అమ్మకాలు రూ.30 వేల కోట్లకు పైగా వ్యాపారం జరిగినట్లు సమాచారం.

2024-25లో సగటున రోజుకు రూ. 83.38 కోట్ల విలువైన మద్యాన్ని మందుబాబులు తాగేశారు. అయితే కూటమి ప్రభుత్వం(AP Government) లిక్కర్ ధర తగ్గించడంతో అమ్మకాలు (Liquor Sales) పెరిగాయి, కానీ రాబడి పెద్దగా లేదని చెబుతున్నారు. దీంతో గతేడాదితో పోలిస్తే విక్రయాల్లో 9.1% పెరుగుదల కనిపించింది. విలువ మాత్రం 0.34% పెరిగింది.

ఇక మద్యం అమ్మకాలు ఎక్కువగా కర్నూలు జిల్లాలో జరిగాయి. అత్యల్పంగా కడప జిల్లాలో జరిగినట్లు సమాచారం. ఇదిలా ఉంటే, రాష్ట్రంలో బెల్ట్ షాపులు, నాటు సారా నియంత్రించేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని ఎక్సైజ్ శాఖ అధికారులకు మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశాలు జారీ చేశారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు