Friday, 7 August 2026

టర్కీ విమానాశ్రయంలో 40గంటలుగా చిక్కుకుపోయిన 200మంది భారతీయులు

ఈ నెల రెండు న లండన్ నుండి వర్జిన్ అట్లాంటిక్ విమానం ముంబాయి కి బయలుదేరింది. ఈ విమానంలో మొత్తం 250 మంది ప్రయాణీకులు ఉండగా వారిలో 200 మందికి పైగా భారతీయులు. ఒక మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా టర్కీ లోని ఓ మారుమూల ప్రాంతంలో వున్న దియార్ బకిర్ ఎయిర్‌పోర్ట్ లో విమానం లాండ్ అయింది. అయితే లాండ్ అయిన అనంతరం విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దాంతో 40 గంటలకు పైగా ప్రయాణీకులు అక్కడే చిక్కుకుపోయారు. ఆ మారుమూల ఎయిర్‌పోర్ట్ లో సౌకర్యాల లేమితో పాసెంజర్లు అల్లాడిపోతున్నారు. ఒక్కటే టాయిలెట్ వుందని, సెల్ ఫోన్ చార్జింగ్ పాయింట్స్ కూడా లేవని ఆవేదనా చెందుతున్నారు. చిన్న పిల్లలు, గర్భిణులు, వృద్ధులు ఇబ్బంది పడుతున్నారని, త్వరగా ఆల్టర్నేటివ్ ఎరేంజ్‌మెంట్స్ చేసి, తమను ముంబాయి పంపించాలని ప్రాధేయపడ్డారు.

ప్రయాణీకుల కష్టాల పట్ల వర్జిన్ అట్లాంటిక్ ఎయిర్‌లైన్స్ స్పందించింది. తమ ప్రయాణీకులు, సిబ్బంది భద్రతే తమకు ముఖ్యమని చెబుతూ ప్రయాణీకులకు కలిగిన అసౌకర్యానికి హృదయపూర్వక క్షమాపణలు చెప్పారు. ఏప్రిల్ 4న, స్థానిక కాలమానం ప్రకారం 12.00 గంటలకు దియార్ బకిర్ విమానాశ్రయం నుండి ముంబాయి కి విమానం ఏర్పాటు చేస్తామని, ఒకవేళ దానికి పర్మిషన్స్ రాకపోతే పాసెంజర్లను మరొక ఎయిర్‌పోర్ట్ కి తరలించేందుకు బస్సును ఏర్పాటు చేస్తామని, ఆ తరువాత మరో విమానంలో వారిని ముంబాయి కి పంపిస్తామని, రాత్రివేళలో ప్రయాణీకుల బస చేసేందుకు ఏర్పాట్లు చేస్తామని, సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని వర్జిన్ అట్లాంటిక్ రిప్రజెంటేటివ్ తెలియచేశారు.

ఈ మొత్తం ఎపిసోడ్ పై అంకారాలోని ఇండియన్ ఎంబసీ స్పందించింది. వర్జిన్ అట్లాంటిక్ ఎయిర్‌లైన్స్, దియార్ బకిర్ ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్లతో సంప్రదింపులు జరుపుతున్నది.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు