Friday, 7 August 2026

అమెరికా పౌరసత్వం కోరుకుంటున్న ప్రపంచవ్యాప్త సంపన్నులను ఆకర్షించేందుకు గోల్డ్ కార్డ్ విడుదల చేసిన ట్రంప్

ఒకవైపు అక్రమ వలసలను నిరోధిస్తానని చెబుతూ, ఇప్పటికే నిబంధనలకు వ్యతిరేకంగా గడువు ముగిసిన వలసదారులను కఠినంగా డిపోర్ట్ చేయిస్తున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. మరోవైపు అమెరికా పౌరసత్వాన్ని కోరుకుంటున్న ప్రపంచవ్యాప్తంగా సంపన్నులను ఆకర్షించేందుకు ఇటీవల ‘గోల్డ్ కార్డ్’ ను ప్రకటించారు. ఆ కార్డ్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను ఆయన విడుదల చేశారు. ఆ గోల్డ్ కార్డ్ మీద ట్రంప్ ఫోటోనే ఉంది. దాన్ని ఆయన 5 మిలియన్ డాలర్లతో కొనుగోలు చేశారని చెప్పారు. ఎయిర్ ఫోర్స్ వన్‌లో విలేకరులతో మాట్లాడే సమయంలో ఆయన దీన్ని చూపించారు. దీన్ని తానే మొదటగా కొనుగోలు చేశానని అన్నారు. EB-5 వీసా (Investor’s Visa) విధానాన్ని రద్దు చేసి, 43.5 కోట్ల రూపాయిలు (50 లక్షల డాలర్లు) వెచ్చించగలవారికి ఈ గోల్డ్ కార్డ్ అందిస్తామని ఇటీవల ట్రంప్ ప్రకటించారు. దీన్ని కొనుగోలు చేసినవారికి నేరుగా అమెరికా పౌరసత్వాన్ని అందజేస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంపన్నులను ఆకర్షించేందుకే దీన్ని ప్రవేశపెట్టామని, వారు అమెరికాకు వచ్చి భారీగా ఖర్చు పెడితే, స్థానికంగా ఉద్యోగాలు పెరుగుతాయని ట్రంప్ అన్నారు.

గోల్డ్ కార్డుకు భారీగా స్పందన వచ్చిందని, ఒక్కరోజే 1,000 కార్డులను అమ్మినట్లు వాణిజ్య శాఖ మంత్రి హోవర్డ్ లుట్నిక్ ఇటీవల తెలిపారు. వీటి ద్వారా 5 బిలియన్ డాలర్లు సేకరించామన్నారు. ప్రపంచవ్యాప్తంగా 3.7 కోట్ల మందికి ఈ కార్డు కొనే సామర్థ్యం ఉందని చెప్పారు. చట్టబద్ధ ఇన్వెస్టర్లకు పౌరసత్వం, శాశ్వత నివాసం కల్పించేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు. చూద్దాం ట్రంప్ ప్రవేశపెట్టిన గోల్డ్ కార్డ్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎంత స్పందన వస్తుందో!

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు