Friday, 7 August 2026

తమిళనాడు ప్రభుత్వం విజ్ఞప్తి చేసిన NEET వ్యతిరేఖ బిల్లును తిరస్కరించిన రాష్ట్రపతి

NEET పరీక్షల వల్ల ఇటీవల తమిళనాడులో విద్యార్థుల ఆత్మహత్యలు జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, తమిళనాడు ముఖ్యమంత్రి MK స్టాలిన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి లేఖ రాశారు. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించి పంపిన NEET వ్యతిరేక బిల్లును ఆమోదించాలని ఆయన కోరారు. NEET పరీక్ష వల్ల తమిళనాడులో విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య 16కి చేరిందని ఆయన పేర్కొన్నారు.

NEET మినహాయింపు బిల్లును ఆమోదించడం వల్ల విద్యార్థుల మరణాలు పునరావృతం కాకుండా నివారించవచ్చని చెప్పారు. ఇదిలా ఉండగా, NEET పరీక్షను రెండుసార్లు రాసి, కానీ ర్యాంకు రాలేదనే మనస్తాపంతో ఒక విద్యార్థి శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ కోర్సుల బిల్లు 2021కి అనుమతి మంజూరులో ఆలస్యం వల్లే విద్యార్థుల ఆత్మహత్యల సంఘటనలు చోటుచేసుకున్నాయని ముఖ్యమంత్రి స్టాలిన్ ఆవేదన వ్యక్తం చేశారు.

అందుకే, వెంటనే ఈ బిల్లుకు ఆమోదం తెలపాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి విజ్ఞప్తి చేశారు. NEET పరీక్షల ఒత్తిడి కారణంగా ఆగస్టు 12, 13వ తేదీల్లో కొడుకు, తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటనలను కూడా ఆయన తన లేఖలో ప్రస్తావించారు.

ఈ బిల్లుకు సంబంధించిన శాసన ప్రక్రియను ప్రస్తావించిన ముఖ్యమంత్రి స్టాలిన్, NEET ఆధారిత ప్రవేశ ప్రక్రియ వల్ల పేద, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులపై పడుతున్న ప్రతికూల ప్రభావాన్ని జస్టిస్ AK రాజన్ కమిటీ అధ్యయనం ద్వారా వెల్లడించారు.

ఆ కమిటీ సమర్పించిన నివేదిక ఆధారంగా, 2021 సెప్టెంబర్ 13న ఈ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం లభించిందని ఆయన తెలిపారు.

ఇటువంటి పరిణామాల్లో, MBBS, BDS కోర్సుల్లో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో నిర్వహించే NEET పరీక్ష నుండి తమిళనాడు రాష్ట్రాన్ని శాశ్వతంగా మినహాయించాలని తమిళనాడు ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టింది.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు