Friday, 7 August 2026

ట్రైన్ వాష్‌రూమ్‌లో బాలికపై లైంగిక దాడి వేధింపులు

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పరిధిలో దారుణ ఘటన
కదులుతున్న ట్రైన్లో 25 ఏళ్ల యువకుడు మైనర్ బాలికను లైంగికంగా వేధించడమే కాకుండా, వీడియోలు చిత్రీకరించిన దారుణ ఘటన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడిని పట్టుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఒక్కసారిగా యువకుడు అసభ్యకరంగా ప్రవర్తించడంతో బాలిక తీవ్ర భయాందోళనకు గురైంది.

హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రదేశాలను చూడటానికి ఒడిస్సా నుంచి ఓ కుటుంబం హైదరాబాద్‌కు బయలుదేరింది. రక్సెల్ సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ రైలులో బాలిక కుటుంబం హైదరాబాద్‌కు ప్రయాణం చేసింది. ఈ క్రమంలో అర్థరాత్రి రెండు గంటల ప్రాంతంలో మైనర్ బాలిక ట్రైన్‌లో వాష్‌రూమ్‌ కు వెళ్లింది. బాలిక ఒంటరిగా వెళ్లడాన్ని చూసిన ఓ వ్యక్తి ఆమెను ఫాలో అయ్యాడు. బాత్రూమ్‌లోనే బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు దుండగుడు. అంతటితో ఆగకుండా, తాను చేస్తున్న ఘోరాన్ని, బాలిక దృశ్యాలను తన మొబైల్‌లో రికార్డ్ చేశాడు నిందితుడు. దుండగుడి వేధింపులతో తీవ్ర భయాందోళనకు గురైన బాలిక అక్కడి నుంచి తప్పించుకుని కుటుంబసభ్యుల వద్దకు వచ్చి జరిగిన ఘోరాన్ని తెలియజేసింది.

దీంతో వెంటనే బాలిక తండ్రి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు హైదరాబాద్ నగరంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బాధితురాలిని, నిందితుడిని ఓ రహస్య ప్రదేశంలో ఉంచి పోలీసులు విచారిస్తున్నారు. అలాగే బాలికకు వైద్యులు వైద్యపరీక్షలు నిర్వహించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై రైల్వే పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు