Friday, 7 August 2026

ACB వలలో నీటిపారుదల AE రవి కిశోర్‌

NOC జారీ చేసేందుకు రూ. పది లక్షల లంచం డిమాండ్‌ చేసిన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల నీటిపారుదల శాఖ AE రవికిషోర్ ‌ACBకి చిక్కారు.

గుమ్మడిదల గ్రామ శివారులో సంతోష్‌ అనే వ్యక్తి తన 4,400 గజాల స్థలానికి ఇటీవల ప్రహరీ నిర్మించాడు. పక్కనే చిన్న నాలా ప్రవహిస్తుండటంతో డ్రైనేజీని నిర్మించాడు. గత నెల 28న మండల నీటిపారుదల శాఖ AE రవికిషోర్‌ సదరు స్థల యజమానిని హైడ్రా పేరుచెప్పి బెదిరించాడు. నిబంధనలకు విరుద్ధంగా నాలాను కబ్జా చేసి ప్రహరీనిర్మించారని, దీనిపై హైడ్రాకు ఫిర్యాదు చేసి కూల్చి వేయిస్తామన్నాడు. ఇందుకు సమ్మతించవలసినట్లు చెప్పాడు.

ఇదంతా జరగకూడదంటే రూ. పది లక్షలు ఇవ్వాలని, తీరా నాలాకు NOC జారీ చేస్తామని చెప్పాడు. పలు దఫాలుగా జరిపిన చర్చల్లో రూ.7 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం జరిగింది.

తరువాత స్థల యజమాని NOCకి దరఖాస్తు చేసుకున్నాడు. ముందస్తుగా రూ. లక్ష చెల్లించాలని డిమాండ్‌ చేయడంతో శుక్రవారం ఉదయం బాధితుడు హైదరాబాద్‌ ACB విభాగాన్ని ఆశ్రయించాడు. తరువాత పటాన్‌చెరు DE కార్యాలయం వద్దకు చేరుకున్న బాధితుడు AE రవికిషోర్‌ను కలుసుకుని రూ. లక్ష చెల్లిస్తానన్నారు. కార్యాలయం వద్దనే బయట తన సిల్వర్‌ కలర్‌ స్కోడా కారు ముందు సీట్లో కూర్చుని డ్యాష్‌ బోర్డులో పెట్టాలని సూచించారు.

వెనక సీట్లో కూర్చున్న రవికిషోర్‌ సూచనల మేరకు రెండు రూ.500 నోట్ల కట్టలను డ్యాష్‌ బోర్డులో పెట్టాడు. కార్యాలయం ఆవరణలో మాటు వేసి చూస్తున్న ACB అధికారులు రంగంలోకి దిగి రవికిషోర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ACB DSP శ్రీధర్‌ మాట్లాడుతూ, AE రవికిషోర్‌ NOC జారీ చేసేందుకు లంచం రూపంలో రూ. లక్ష తీసుకున్నానని అంగీకరించినట్లు స్పష్టం చేశారు. ఈ వ్యవహారం అంతటినీ వీడియో తీశామని తెలిపారు. AEని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించామని DSP తెలిపారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు