Friday, 7 August 2026

హైదరాబాద్ లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ పడిపోవడం పై KTR విమర్శలు

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక హైదరాబాద్ లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ క్షీణిస్తోందని (Office Space Leasing Down in Hyderabad) BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామా రావు (KTR) విమర్శించారు.

జనవరి-మార్చి త్రైమాసికంలో ఇప్పటి వరకు నమోదైన లావాదేవీల ఆధారంగా రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ‘కొలియర్స్ ఇండియా’ నివేదికపై (Colliers Report) ఆయన స్పందించారు.

దేశవ్యాప్తంగా టాప్-7 నగరాల్లో ఈ ఏడాది తొలి 3 నెలల కాలంలో ఆఫీస్ వసతుల లీజింగ్ మెరుగైన వృద్ధిని సాధించగా, హైదరాబాద్, కోల్‌కత్తా పట్టణాల్లో మాత్రం క్షీణత కనిపించిందని ఈ నివేదిక స్పష్టం చేసింది.

ఈ నివేదికపై ఎక్స్ వేదికగా స్పందించిన KTR రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త IT పార్కులను ప్లాన్ చేయడానికి ముందు, తొలి త్రైమాసికంలో హైదరాబాద్ లో ఆఫీస్ లీజింగ్ లో 41% క్షీణతను పరిష్కరించాలన్నారు. ఈ తిరోగమణం దేశవ్యాప్తం జరుగుతున్నది కాదని, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ-NCR, ముంబయి, పూణే వంటి నగరాలు గణనీయమైన వృద్ధిని సాధిస్తుంటే, హైదరాబాద్ మాత్రం తిరోగమనంలో ఉందని విమర్శించారు.

గత కొన్ని సంవత్సరాలుగా ఆఫీస్ స్పేస్ లీజింగ్ లో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉండేది. ఇప్పుడు క్షీణించడంపై ప్రభుత్వం తన పనితీరు పట్ల ఆత్మపరిశీలన చేసుకుని దిద్దుబాటు చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రభుత్వ విధానాలను పునః పరిశీలన చేసుకోవాలని ఈ విషయంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలను తెలుసుకోవాలన్నారు.

విధ్వంసం, విధ్వంసాన్నే సృష్టిస్తుంది. బుల్డోజర్లు ఉద్యోగాలు తీసుకురాలేవు. ఆ పనిని ప్రభుత్వ పాలసీలు చేస్తాయి అన్నారు.
కోలుకోలేని నష్టం రాకముందే ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించాలి అని కోరారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు