Friday, 7 August 2026

YSRCP MPని అరెస్ట్ చేయటానికి ఢిల్లీ వెళ్లిన AP CID

గత YCP ప్రభుత్వ హయాంలో మద్యం విక్రయాలు, తయారీ లో అవకతవకలు జరిగాయని, దీని వల్ల రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని ఆరోపణలు వచ్చాయి. ఈ కుంభకోణంలో రాజంపేట MP పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ప్రమేయం ఉందని క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (CID) ఆరోపించింది. మిథున్ రెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన కొన్ని డిస్టిలరీలు నాసిరకం మద్యాన్ని ఉత్పత్తి చేసి, ప్రభుత్వ ఛానెళ్ల ద్వారా అధిక ధరలకు విక్రయించారని ఆరోపణలు ఉన్నాయి. అలాగే, మద్యం కోటాలను కొన్ని డిస్టిలరీలకు పెంచడంలో, మరికొన్నింటిని తగ్గించడంలో ఆయన ప్రభావం చూపినట్లు సందేహాలు వ్యక్తమయ్యాయి.

ఈ కోణంలో CID అధికారులు దర్యాప్తు చేస్తుండగా, ఆయన గత నెలలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఆయన తరఫున వాదిస్తూ, తాను MPగా రాష్ట్ర ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేదని, తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని పేర్కొన్నారు. ఏప్రిల్ 3న హైకోర్టు మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది. ఇది జరిగిన మరుసటి రోజు YCP MP మిథున్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం అయింది. మిథున్ రెడ్డిని అరెస్టు చేసేందుకు MP CID బృందాలు ఢిల్లీకి వెళ్లాయి. హైకోర్టు ముందస్తు బెయిల్ పిటీషన్ ను తిరస్కరించడంతో మిథున్ రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు