Friday, 7 August 2026

ట్రంప్‌ పోటుతో భారీగా పతనమైన రొయ్యల ధరలు: కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ

ఆంధ్రా రొయ్యకు అమెరికా దెబ్బ తగిలింది. ట్రంప్‌ సుంకాల ఎఫెక్ట్‌తో రొయ్యల రైతులు కుయ్యోమొర్రో అంటున్నారు. దీనికితోడు దళారుల దగా దందాతో నిలువుదోపిడీకి గురవుతున్నారు. క్రాప్‌ హాలీడే పేరుతో ఆందోళనకు సై అంటున్నారు. ఏపీ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే రొయ్యలపై దిగుమతి సుంకం 3 శాతం నుంచి 26 శాతానికి పెంచేశారు దీంతో లక్ష రూపాయలు విలువ చేసే రొయ్యలు ఇక లక్షా 26 వేలు కానున్నాయి. రవాణా, ప్యాకింగ్‌తో కలిపి ఎక్స్‌ట్రా బాదుడు 50 శాతానికి చేరుకుంటోంది. ఇక రొయ్య ధర కేజీకి రూ. 30 నుంచి 50 వరకు తగ్గించేసి రైతుల గుండెల్లో మరో గునపం గుచ్చారు ఎక్స్‌పోర్టర్స్‌. దీంతో రొయ్య రేటు ఒక్కసారిగా పడిపోయింది.

అమెరికా పెంచిన ట్యాక్స్ ఈ నెల తొమ్మిది నుంచి అమలు కానుంది. రొయ్యల సాగు, ఎగుమతుల్లో ఏపీ అగ్రగామిగా ఉంది. ఏపీ GSDPలో రొయ్యల పరిశ్రమ వాటా 11 శాతం. 2 రోజుల క్రితం 100 కౌంట్ ధర రూ. 250 ఉంటే ఇప్పుడు 210 కి కొంటున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలో 2.50 లక్షల ఎకరాల్లో రొయ్యలను సాగు చేస్తున్నారు. ఏపీ నుంచి అమెరికాకు ఏటా 17.2 లక్షల టన్నుల వనామీ రొయ్యలు ఎగుమతి అవుతున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచే రోజుకు 2 వేల టన్నుల రొయ్యలు ఎగుమతి అవుతాయి. అమెరికాకు 50 కౌంట్‌ లోపు రొయ్యలు మాత్రమే ఎగుమతి అవుతాయి. కానీ అన్ని కౌంట్ల రొయ్యల రేటును వ్యాపారులు తగ్గించెయ్యడంపై రైతులు మండిపడుతున్నారు. ఆక్వా రంగాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరుతున్నారు.

రైతుల ఆందోళన నేపథ్యంలో, ఆక్వా రంగానికి అండగా నిలవాలని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌కు ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. అమెరికా సుంకాల నుంచి ఆక్వా ఉత్పత్తులకు మినహాయింపు ఇచ్చేలా చూడాలని ఆ లేఖలో చంద్రబాబు కోరారు. ఏపీ జీడీపీలో మత్స్యరంగం కీలకంగా ఉందన్న చంద్రబాబు.. సంక్షోభ సమయంలో ఆక్వా రైతులకు అండగా ఉండాలని కోరారు. భారత్‌పై అమెరికా 27శాతం సుంకం విధింపు వల్ల ఆక్వారంగానికి నష్టమంటూ వివరించారు. అధిక సుంకాల వల్ల మన ఆర్డర్లను ఇతర దేశాలు రద్దు చేసుకుంటున్నాయని, ఏపీ శీతల గిడ్డంగుల్లోనూ నిల్వ కోసం స్థలం లేదని.. చంద్రబాబు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆక్వా రైతులకు మేలు చేసేలా కేంద్రం చర్యలు చేపడుతుందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ చెప్పారు. ఆక్వా రైతులు ఆందోళన చెందొద్దని పేర్కొన్నారు..

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు