Friday, 7 August 2026

దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్లు (2013) నిందితులకు మరణశిక్షను సమర్ధించిన హైకోర్ట్

దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్లు (2013) నిందితులకు మరణశిక్షను సమర్ధించిన హైకోర్ట్

21 ఫిబ్రవరి 2013 న దిల్‌సుఖ్‌నగర్ లో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో నిందితులకు ఎన్.ఐ.ఏ. కోర్ట్ విధించిన మరణశిక్షను తెలంగాణ హైకోర్ట్ మంగళవారం ధృవీక్రించింది. వివరాల్లోకి వెళితే 21 ఫిబ్రవరి, 2013న రెండు సమాంతర పేలుళ్లు — ఒకటి షిర్డీ సాయి బాబా మందిరం దగ్గర, మరొకటి వెదురుబజార్ బస్ స్టాండ్ వద్ద బాంబు పేలుళ్లు జరిగాయి. ​ఈ పేలుళ్లలో 18 మంది మరణించగా, 131 మంది గాయపడ్డారు.​

National Investigation Agency (NIA) ప్రత్యేక కోర్టు 2016లో ఐదుగురు దోషులు అసదుల్లా అక్తర్​, తహసీన్ అక్తర్​, జియా ఉర్ రెహ్మాన్​, యాసిన్ భట్కల్​, అజాజ్ షేక్ లకు​ మరణదండన విధించింది。 ​దోషులు తమ శిక్షను సవాల్ చేస్తూ హైకోర్టులో అప్పీలు దాఖలు చేశారు, కానీ హైకోర్టు ఆ అప్పీలను తిరస్కరించి, NIA కోర్టు తీర్పును సమర్థించింది.

ఈ తీర్పు దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో న్యాయ ప్రక్రియలో ఒక ముఖ్యమైన మైలురాయి. సాధారణంగా Capital Punishment (మరణశిక్ష) విధించే క్రమంలో “Rarest of rare” అనే doctrine ని అన్వయిస్తారు. అంటే కేసు అరుదైన కేసుల్లో అత్యంత అరుదైన కేసు అయ్యుండాలి. భారతదేశం మరణశిక్షను సాధారణంగా విధించదు. కానీ జాతికి ప్రమాదంగా ఉండే, ఉద్దేశపూర్వకమైన తీవ్ర దుష్కృత్యాలకు ఇది వర్తిస్తుంది. నిందితులపై సాంకేతిక ఆధారాలు, సాక్ష్యాలు, ఫోరెన్సిక్ ఆధారాలు, Identity వంటి అంశాలు ప్రధాన పాత్ర పోషించాయి.

అప్పీలకు అవకాశం: ఇప్పుడు దోషులకు సుప్రీంకోర్టులో రివ్యూలు, Curative Petition, రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ లాంటి మార్గాలు మిగిలి ఉన్నాయి.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు