Friday, 7 August 2026

భారత్ కు అమెరికా 26/11 నిందితుడు తహవూర్ రాణా అప్పగింత. ప్రత్యేక విమానంలో తరలింపు

26, నవంబర్ 2008 ముంబై ఉగ్రదాడుల కేసులో నిందితుడు తహవూర్ రాణాను భారతదేశానికి అప్పగించడానికి అమెరికా సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ అనుమతిని అనుసరించి, భారత జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఐదుగురు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేసింది. వారు రాణాను అమెరికా నుండి ప్రత్యేక విమానంలో భారత్‌కు తీసుకు వస్తున్నారు. ​ ఈ రాత్రికి లేదా రేపు తెల్లవారుజాము ఆ విమానం భారత్ చేరవచ్చు.

తనను భారత్ కు అప్పగించవద్దంటూ రాణా దాఖలు చేసిన Review Petition ను 2025 జనవరి 21న అమెరికా సుప్రీంకోర్టు తిరస్కరించింది, తద్వారా ఆయనను భారత్‌కు అప్పగించడానికి మార్గం సుగమం అయింది. ​ రాణా అప్పగింతపై అమెరికా అధ్యకుడు ట్రంప్ సైతం భారత ప్రధాన మోడీ అమెరికా పర్యటన సమయంలో హామీ ఇచ్చారు. “26/11 ముంబాయి ఉగ్రదాడిలో నిందితుడైన అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిని భారత్ కు అప్పగిస్తాం. అలాగే త్వరలో మరింతమంది నేరగాళ్ల విషయంలో కూడా అదే నిర్ణయం తీసుకుంటాం” అని ట్రంప్ ప్రకటించిన మేరకు ఇవాళ రాణాను భారత్ కు అప్పగించారు.

తహవూర్ రాణా, పాకిస్తాన్‌లో జన్మించిన కెనడియన్ వ్యాపారవేత్త, 2008 ముంబై ఉగ్రదాడుల్లో పాత్ర ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి. prastutam Los Angels జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ దాడుల్లో 166 మంది మరణించారు. ​ రాణాను భారత్‌కు తీసుకువచ్చిన తరువాత, ఆయనపై భారత న్యాయవ్యవస్థలో విచారణ కొనసాగుతుంది.​

ఈ పరిణామాలు భారత్ మరియు అమెరికా మధ్య న్యాయ సహకారాన్ని ప్రతిబింబిస్తాయి. ఉగ్రవాద నేరస్తులను చట్టం ముందు నిలబెట్టడంలో ప్రాముఖ్యతను చూపుతాయి.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు