Friday, 7 August 2026

డ్రోన్స్ ద్వారా విజిలెన్స్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న కృష్ణా జిల్లా పోలీసులు

ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా పోలీసులు బహిరంగ నేరాలను గుర్తించడంలో, నిరోధించడంలో ఆధునిక సాంకేతికతని ఉపయోగిస్తూ కొత్త పుంతలు తొక్కుతున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ పరిధిలోని ఓ ఇంజినీరింగ్ కాలేజ్ వెనుక వైపు ఇద్దరు యువకులు ఖాళీ ప్రదేశంలో కూర్చొని తీరిగ్గా మద్యం సేవించడం మొదలుపెట్టారు. ఆ సమయంలో పోలీసులు డ్రోన్ కెమెరాని ఎగరేసి వారి ‘సరదా’ని రికార్డ్ చేయడం మొదలెట్టారు. అది గమనించిన యువకుల్లో ఒకరు పరిగెత్తి కొంత దూరంలో వున్న చెట్టు కింద కనబడకుండా నిలబడ్డాడు. ఐనా అక్కడికి కూడా డ్రోన్ అతడిని వెంటాడింది. ఇంక లాభం లేదని వారిద్ద్దరూ మామూలుగా మోటార్ సైకిల్ ఎక్కి వెళ్లిపోయారు. అనంతరం పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.

ఈ సంఘటన వీడియోకి కృష్ణా జిల్లా పోలీసులు మన్మధుడు సినిమాలోని బిజిఎం జోడించి తమ ‘ఎక్శ్ ఖాతాలో పోస్ట్ చేయగా ఏపి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన ‘ఎక్స్ ‘ ఖాతాలో రీపోస్ట్ చేస్తూ “సారీ గైస్! మీకెవరూ సహాయం చేయలేరు. పోలీస్ డ్రోన్స్ తమ విధిని తాము నిర్వర్తిస్తున్నాయి” అనే తమాషా వ్యాఖ్య జత చేశారు.

ఈ మధ్య కాలంలో జిల్లా వ్యాప్తంగా కృష్ణా జిల్లా వ్యాప్తంగా డ్రోన్ల ద్వారా నేరాల నియంత్రణకు విజిలెన్స్ కార్యకలాపాలు నిర్వహించడం ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు