Saturday, 8 August 2026

తెలంగాణలో మళ్లీ భూకంపం వచ్చే అవకాశం?

తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భూకంపం సంభవించే అవకాశం ఉందని Epic ( Earthquake Research & Analysis ) హెచ్చరికలు జారీచేసింది. తమ పరిశోధనల ప్రకారం రామగుండం సమీపంలో భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని పేర్కొంది. దాని ప్రభావం హైదరాబాద్, వరంగల్ నుంచి అమరావతి, మహారాష్ట్ర వరకు ఉండవచ్చని పేర్కొంది. అయితే, ఈ విషయాన్ని ప్రభుత్వం కానీ, శాస్త్రీయ సంస్థలు కానీ ధృవీకరించలేదు. భూకంపాలను ముందస్తుగా అంచనా వేయడం సాధ్యం కాదని అంటున్నారు.

ఇవి తక్కువ నుంచి మోస్తారు భూకంప ప్రమాదాన్ని మాత్రమే సూచిస్తాయి. గతంలో ఈ ప్రాంతంలో కొన్ని చిన్న చిన్న భూకంపాలు సంభవించాయి. అవి ఏమాత్రం నష్టం కలిగించలేదు.ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో భూకంపాల రికార్డు కూడా పెద్దగా లేదు. కొద్ది సందర్భాల్లో స్వల్ప భూకంపాలు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. 1969 ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రాంతంలో 5.1 తీవ్రత గల భూకంపం వచ్చింది. అది అప్పల్లో రాష్ట్రాన్ని బాగా ఊపేసిందని చెప్పొచ్చు. ఆ తరువాత 1998లో తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా 4.5 తీవ్రతతో ప్రకంపనలు నమోదు అయ్యాయి. అలాగే హైదరాబాద్‌లో 1984, 1999, 2013లో చిన్న భూకంపాలు మాత్రమే సంభవించగా ప్రజలు ఒక్కసారిగా భయపడిపోయారు. కానీ ఎలాంటి ఆస్తి నష్టం కూడా సంభవించలేదు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు