Friday, 7 August 2026

​అమెరికాలోని హడ్సన్ నదిలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో CEO of Siemens Agustín Escobar మృతి

అమెరికాలోని న్యూయార్క్ నగరంలో జరిగిన ఘోర ప్రమాదం లో ఒక పర్యాటక హెలికాప్టర్‌ అనుకోకుండా నదిలో కుప్పకూలింది. ప్రమాదంలో జర్మనీలోని ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం సీమెన్స్ స్పెయిన్ విభాగం సీఈఓ అగస్టిన్ ఎస్కోబార్‌, ఆయన కుటుంబ సభ్యులు సహా మొత్తం ఆరుగురు దుర్మరణం చెందారు.

సీమేన్స్ కంపెనీ స్పెయిన్ శాఖాధిపతి అగస్టిన్ ఎస్కోబార్ తన భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి న్యూయార్క్‌కు పర్యటన నిమిత్తం వచ్చారు. వీరంతా ప్రయాణిస్తున్న హెలికాప్టర్ హడ్సన్ నది పైనుండి ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా అదుపుతప్పి గాల్లో తిరుగుతూ నదిలో తలకిందులుగా పడిపోయింది. పడిన కొద్దిసమయంలోనే హెలికాప్టర్‌కి మంటలు అంటుకోవడంతో అంతర్గతంగా ఉన్నవారు బయటకు రావడానికీ అవకాశం లేకుండా పోయింది.

ఈ ప్రమాదంలో ఎస్కోబార్‌తో పాటు ఆయన భార్య, ముగ్గురు పిల్లలు,పైలట్‌ ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక సమాచారం వెల్లడించింది. ఈ హెలికాప్టర్‌ “బెల్‌ 206” మోడల్‌కి చెందినదిగా గుర్తించగా, ఇది న్యూయార్క్‌ హెలికాప్టర్ టూర్స్ సంస్థ ద్వారా పర్యాటకుల కోసం సైట్‌ సీయింగ్ ప్రయాణాల నిమిత్తం వినియోగించబడుతోంది. ప్రమాద ఘటన జరిగిన వెంటనే రెస్క్యూ బృందాలు బోట్ల సహాయంతో ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.

హెలికాప్టర్ పూర్తిగా నీళ్లలో తలకిందులుగా చిక్కుకుపోయిందని వారు పేర్కొన్నారు. గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో హెలికాప్టర్‌లోని ఒక భాగం విరిగిపోయినట్లు కూడా అధికారులు తెలిపారు. ఈహృదయవిదారక దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున వైరల్‌గా మారాయి.ఈ విషాద ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు