Friday, 7 August 2026

విజయసాయి రెడ్డికి బీజేపీ రాజ్యసభ సభ్యుడిగా అవకాశం?

రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నట్లుగా ప్రకటించి ఏ పార్టీలో చేరను అని చెప్పిన విజయ సాయిరెడ్డికి బీజేపీ నుంచి Big offer వచ్చినట్లు చర్చ నడుస్తోంది. ఈ వ్యవహారం ఇప్పుడు కూటమిలో ఆసక్తికర చర్చగా మారింది. వైసీపీలో ముఖ్య నేతగా వ్యవహరించిన మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. తాను ఏ పార్టీలో నూ చేరటం లేదని వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించారు.

వైసీపీకి రాజీనామా చేసే సమయంలోనే సాయిరెడ్డి బీజేపీ నేతలతో టచ్ లోకి వెళ్లారనే ప్రచారం సాగింది. కాగా, సాయిరెడ్డి తాన ఏ పార్టీలో చేరటం లేదని తేల్చి చెప్పారు. ఇప్పుడు ఢిల్లీ కేంద్రంగా సాయిరెడ్డి బీజేపీ లోకి ఎంట్రీ ఇవ్వటానికి రంగం సిద్దమైనట్లు పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. బీజేపీ నేతల్లోనే ఈ చర్చ మొదలైంది. ఏపీలో సాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానం తిరిగి బీజేపీ నుంచి సాయిరెడ్డికే కేటాయించనున్నట్లు చెబుతున్నారు. సాయిరెడ్డి రాజీనామా చేసిన స్థానం బీజేపీకి దక్కేలా ఇప్పటికే కూటమిలో నిర్ణయం జరిగింది. వైసీపీ ఎంపీ ఆర్ క్రిష్ణయ్య రాజీనామా చేసి తిరిగి బీజేపీ నుంచి ఎన్నికైన విధంగానే సాయిరెడ్డి విషయంలో జరగనుందని ఢిల్లీలోని బీజేపీ నేతల సమాచారం. అయితే, సాయిరెడ్డి కూటమి పార్టీల్లో చేరిక పైన టీడీపీ నుంచి అభ్యంతరం వ్యక్తం అవుతున్నట్లు చెబుతున్నారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు