సుమారు 1,000 మంది Israeli Air Force సిబ్బంది ఒక లేఖను ప్రచురించారు. గాజాలోని యుద్ధాన్ని ముగించాల్సిందిగా, అక్కడి నుంచి ఇజ్రాయెలీ బందీలను తిరిగి రప్పించాల్సిందిగా కోరుతూ ఈ లేఖను Haaretz పత్రికలో ప్రచురించారు.
“ప్రస్తుతం యుద్ధం ప్రధానంగా రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాలకు సేవ చేస్తోంది, భద్రతా ప్రయోజనాలకు కాదు. ఈ యుద్ధం ప్రకటించిన ఏ లక్ష్యానికి కూడా తోడ్పడేలాగ లేదు. ఇది బందీల, ఇజ్రాయెలీ సైనికుల మరియు నిర్దోష ప్రజల మరణాలకు, అలాగే ఐడీఎఫ్ [ఆక్రమణ సైన్యం] రిజర్వ్ దళాల క్షీణతకు దారి తీస్తుంది,” అని ఆ లేఖలో క్రియాశీల సభ్యులు మరియు మాజీ సీనియర్ అధికారులు తెలిపారు.
“గతంలోనూ నిరూపించబడ్డట్లుగా, ఒప్పందం ద్వారానే బందీలను సురక్షితంగా తీసుకురాగలుగుతాము. సైనిక ఒత్తిడి ఎక్కువగా బందీల మృతికి మరియు మన సైనికుల ప్రాణాలకు ప్రమాదానికి దారి తీస్తుంది,” అని వారు అన్నారు. అలాగే, “గడిచే రోజూ వారి ప్రాణాలకు ప్రమాదాన్ని పెంచుతోంది” అని హెచ్చరించారు.
ఈ లేఖ ప్రచురితమైన అనంతరం, Israel army Chief of Staff Eyal Zamir మరియు Israeli Air Force commander Major General Tomer Bar ఈ లేఖపై సంతకం చేసిన క్రియాశీల సభ్యులను సైనిక సేవల నుండి తొలగిస్తున్నట్టు ప్రకటించారు.
అయినప్పటికీ, లేఖపై సంతకం చేసిన 970 మంది వాయుసేన సభ్యులలో కేవలం 25 మంది మాత్రమే తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.


