Friday, 7 August 2026

ఆత్మహత్యలకు పరిష్కారం అవకాశాలు సృష్టించుకోవడమే!

హీరోగా, కమెడియన్ గా, కేరక్టర్ ఆర్టిస్టుగా లెక్కలేనన్ని సినిమాల్లో నటించి ‘నటకిరీటి ‘ అనే బిరుదుని స్వంతం చేసుకున్న లెజండరీ యాక్టర్ రాజేంద్రప్రసాద్. ఏ పాత్ర వేసినా అందులోకి పరకాయ ప్రవేశం చేసే గొప్ప నటుడాయన. అంతగా ప్రాధాన్యత లేని చిన్న చిన్న పాత్రలతో కొంతకాలం ఏదో నెట్టుకొచ్చినా 1985లో వచ్చిన “ప్రేమించు పెళ్లాడు”తో హీరోగా తన ప్రయాణం మొదలు పెట్టినప్పటి నుండి ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆయనని కామెడీలో సూపర్ స్టార్ చెసిన సినిమా మాత్రం “లేడీస్ టైలర్”. వందలాది సినిమాల్లో తన కామెడీ టైమింగ్, యాప్ట్ బాడీ లాంగ్వేజ్ తో ప్రేక్షకుల్ని నవ్వించిన రాజేంద్రప్రసాద్ ‘ఎర్ర మందారం’ వంటి సీరియస్ సినిమాలతో కూడా ఆకట్టుకున్నారు. ‘ఆ నలుగురు ‘ సినిమాతో పూర్తి స్థాయి కేరక్టర్ ఆర్టిస్టుగా సెటిల్ ఐన రాజేంద్ర ప్రసాద్ నలభై ఐదేళ్ల సినిమా జర్నీ తరువాత కూడా ఓ బిజీ ఆర్టిస్టుగా కొనసాగుతున్నారు. ఇప్పటివరకు నాలుగు నంది బహుమతులు, 3 సైమా అవార్డులు అందుకున్న సాఫల్యవంతమైన కళా జీవితం ఆయనది.

అంతటి సుదీర్ఘమైన సినిమా ప్రయాణం చేసిన రాజేంద్రప్రసాద్ ఇటీవల ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరీర్ తొలిదశలో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని అన్నారు. తనకి అవకాశాలు రాకపోవడంతో తన దగ్గరున్న చిల్లర నాణేలు ఖర్చులకు వచ్చినంత కాలం మాత్రమే బతకాలని అనుకున్నారట. చివరికి ఆ నాణేలు అన్నీ అయిపోయాయట. ఇంక చివరి రోజు రానే వచ్చింది. ఒకసారి అప్పటివరకు తనని దగ్గరకు తీసుకున్నవారిని చివరగా చూసొద్దామని బైలుదేరారట. ముందు ఎన్.టీ.ఆర్. దగ్గరకు వెళితే ఆయన బిజీగా వున్నారట. ఆ తరువాత నిర్మాత పుండరీకాక్షయ్య ఆఫీసుకి వెళ్లారట. అప్పటికి ఆయన కడుపు నిండా భోజనం చేసి మూడు నెలలు అయిందట. పుండరీకాక్షయ్యగారు అప్పట్లో ‘మేలుకొలుపు’ అనే సినిమా నిర్మిస్తున్నారు. ఆ సినిమాలో ఎన్.టి.ఆర్. కథానాయకుడు కాదు కానీ ఓ ముఖ్యపాత్రని పోషిస్తున్నారు. రాజేంద్రప్రసాద్ అక్కడికి వెళ్లినప్పుడు పుండరీకాక్షయ్య, అ చిత్ర దర్శకుడు బి.వి.ప్రసాద్ ఏదో పెద్ద టెన్షన్లో వున్నారట. ఆ సినిమా హీరో ఇటు బాలుడు కాదు, అటు పెద్దవాడూ కాని కౌమార్య దశలో వున్నాడు. ఆ పాత్రని తమిళ నటుడు రాజాకృష్ణ పోషించాడు. అతనికి తెలుగు సరిగ్గా రాదు. ఆ హీరో పాత్రకి డబ్బింగ్ చెప్పగల వాయిస్ ఏదీ దొరక్క వాళ్లు టెన్షన్ పడుతున్న సమయంలో రాజేంద్రప్రసాద్ అక్కడికి వెళ్లారు. ఆయన్ని చూసిన పుండరీకాక్షయ్య హమ్మయ్య అనుకొని రిలీఫ్ ఫీలై వాహినీ డబ్బింగ్ స్టుడియోకి తీసుకెళ్లారట. నాలుగు డైలాగులు డబ్బింగ్ చెప్పాక రాజేంద్రప్రసాద్ తాను భోంచేసి మూడు నెలలైందని, ఆకలికి కళ్లు తిరుగుతున్నాయని, ముందు భోజనం పెట్టించమని అడిగారట. అది విని బాధపడి పుండరీకాక్షయ్య తన ఇంటికి తీసుకెళ్లి కడుపునిండా భోజనం పెట్తించారట. అలా డబ్బింగ్ ఆర్టిస్టుగా మారిన రాజేంద్రప్రసాద్ డబ్బింగ్ ద్వారా సంపాదించిన సొమ్ముతో చెన్నైలో ఇల్లు కట్టుకున్నారట.

ఆత్మహత్య చేసుకునేవారు దాన్ని ఓ పరిష్కారం అని నమ్మి చేసుకోరు. వారికి తమ సమస్యలో, సంక్షోభాలో పరిష్కరింపబడే అవకాశాలు కనబడక, ఇంక తమ జీవితాన్ని పునరుద్ధరించుకునే అవకాశం లేదనే డిప్రెషన్లో జీవితాన్ని ముగించుకుంటారు. మీకు దివంగత టాలీవూడ్ హీరో ఉదయకిరణ్ గుర్తున్నాడు కదా? అతనికి ఆత్మహత్య చేసుకునే రోజు ఓ సినిమా అవకాశం వచ్చుంటే ఆత్మహత్య చేసూనేవాడు కాదు. అలాంటి అవకాశమే రాజేంద్రప్రసాద్ కి వచ్చింది. అందువల్ల బతికిపోయాడు. ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదనుకునేవారు తమ సమస్యలు, సంక్షోభాల పరిష్కారానికి అవసరమైన అవకాశాలు సృష్టించుకునే దిశగా ఆలోచిస్తే ఆత్మహత్యలకు దూరంగా వుండగలుగుతారు. “వెలుగునీడలు” సినిమాలోని “కలకానిది విలువైనది” పాటలో “అగాధమౌ జలనిధిలో ఆణిముత్యమున్నటులే శోకాన మరుగున దాగి సుఖమున్నదిలే” అని మహాకవి శ్రీశ్రీ ఊరకే రాయలేదు మరి!

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు