Friday, 7 August 2026

15 గౌడ కుటుంబాల సాంఘిక బహిష్కరణ. అరెస్టులు, పోలీస్ స్టేషన్ ముట్టడితో చెలరేగిన ఉద్రిక్తత

నిజామాబాద్ జిల్లా ఏరుగట్ల మండలం తాళ్లరాంపూర్ గ్రామంలో ఉద్రిక్తత నెలకొన్నది. గ్రామంలో కల్లు అమ్మకాలపై విక్రయాలపై గ్రామాభివృద్ధి కమిటీ పన్ను వేయగా, ఆ పన్నుని కట్టలేమని గౌడ కుటుంబాలు చెప్పాయి. ఈ వివాదం కారణంగా 15 కల్లుగీత కార్మిక కుటుంబాలను గ్రామాభివృద్ధి కమిటీ సాంఘిక బహిష్కరణ చేసింది. సాంఘిక బహిష్కరణ అంటే వెలివేయడమే. వారికి సంఘం నుండి వివిధ కుల వృత్తుల కారణంగా అందాల్సిన సేవలు అందవు. వారి వద్ద నుండి కల్లుని ఎవరూ కొనుగోలు చేయరు. దీనితో వారు పక్క గ్రామాలకు వెళ్లి కల్లు విక్రయాలు చేస్తున్నారు.

శ్రీరామనవమి సందర్భంగా గౌడ కుల మహిళల్ని రామాలయంలోకి రానివ్వలేదు గ్రామాభివృద్ధి కమిటీ. వారు సాంప్రదాయకంగా చేసే కుంకుమార్చన చేయనివ్వలేదు గ్రామాభివృద్ధి కమిటీ. దీనితో ఆ మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యుల్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు కమిటీ సభ్యులపై కేసులు పెట్టి పలువురిని అరెస్ట్ చేశారు. ఇలా అరెస్ట్ అయినవారిలో ఆలయ పూజారి కూడా వున్నారు. దీనితో గ్రామస్తులు అధిక సంఖ్యలో జమ కూడి ఏరుగట్ల పోలీస్ స్టేషన్ని ముట్టడించారు. కమిటీ సభ్యులపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీనితో పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత నెలకొన్నది. ఈ నేపథ్యంలోనే గౌడ కులానికి చెందిన మహిళలను గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు రాముల వారి గుడిలోకి ప్రవేశించనివ్వకపోవడం, వారిని ఊరునుంచి వెళ్లిపోవాలని చెప్పడానికి సంబంధించి ఒక వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నది.

ఇలాంటి సంఘటనలు భారత రాజ్యాంగంలోని సమానత్వ హక్కులను ఉల్లంఘిస్తాయి.​ భారత రాజ్యాంగం ఆర్టికల్ 15 కులం, మతం, లింగం, జన్మస్థల ఆధారంగా వివక్షను నిషేధిస్తుంది.​ ఆర్టికల్ 17 అస్పృశ్యతను నిషేధించి, దానిని శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తుంది.​

ఇలాంటి వివక్షకు గురైన వారు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయవచ్చు. అలాగే, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లేదా ఎస్సీ/ఎస్టీ కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేయవచ్చు.​

ఇలాంటి సంఘటనలు సమాజంలో ఇంకా కుల వివక్ష కొనసాగుతోందని సూచిస్తాయి. ఇవి రాజ్యాంగబద్ధమైన హక్కులను ఉల్లంఘించేవి కావున, సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడం ద్వారా న్యాయం పొందవచ్చు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు