Friday, 7 August 2026

జానారెడ్డి నాకు మంత్రి పదవి రాకుండా చూస్తున్నాడు: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ హోంమంత్రి జానారెడ్డిపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జానారెడ్డి, మరికొంతమంది వ్యక్తులు తనకు మంత్రి పదవి రాకుండా ధృతరాష్ట్రుడు పాత్ర పోషిస్తున్నారని కోమటిరెడ్డి మండిపడ్డారు. మంత్రి పదవి అనేది అడుక్కుంటే వచ్చేది కాదని.. కెపాసిటీని బట్టి వస్తుందన్నారు.

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ..”మంత్రి పదవి అనేది అలంకారం కాదు ఓ బాధ్యత. దాన్ని గుర్తించి ప్రజలకు మంచి చేయాలి. తెలంగాణను గతంలో పాలించింది కుటుంబ పార్టీ. వారికి వంగి వంగి దండాలు పెట్టిన వారికే మంత్రి పదవులు ఇచ్చారు. కాంగ్రెస్ అనేది జాతీయ పార్టీ.. బడుగు బలహీన వర్గాల పార్టీ. నాకు మంత్రి పదవి ఇస్తే కిరీటంలా కాదు.. బాధ్యతగా భావిస్తా. నాలాంటి వ్యక్తి మంత్రి పదవి ఇవ్వాలని పదేపదే అడుగుతుంటే చాలా బాధేస్తోంది.

ఒక ఇంట్లో ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తారా? అని ఓ వ్యక్తి అంటున్నారు. దేశం తరఫున క్రికెట్లో అన్నదమ్ములు యూసుఫ్ పటాన్, ఇర్ఫాన్ పటాన్ ప్రాతినిధ్యం వహిస్తే లేనిది మంత్రి పదవులు ఇద్దరికి ఇస్తే తప్పా. మంత్రి పదవి అనేది అడుక్కుంటే వచ్చేది కాదు.. కెపాసిటిని బట్టి వస్తుంది. 30 ఏళ్లు మంత్రి పదవి అనుభవించిన జానారెడ్డికి నేడు రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల వారికి మంత్రి పదవి ఇవ్వాలని గుర్తొచ్చింది.

హైదరాబాద్, మహబూబ్ నగర్ , మెదక్ లాంటి జిల్లాల్లో మంత్రులకు ఇన్‌ఛార్జ్ బాధ్యతలు ఇచ్చినా ఎంపీలు గెలవలేదు. భువనగిరిలో ఒక ఎమ్మెల్యేగా నేను గెలిపించా. నా మంత్రి పదవి విషయంలో కొందరు దుర్మార్గులు, జానారెడ్డి లాంటి వ్యక్తులు ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి అంటే గల్లా ఎగరేసుకొని ఉంటాడే తప్పా అడుక్కునే స్థితిలో ఉండడని” చెప్పారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు