Friday, 7 August 2026

లైంగిక వేధింపులకు పాల్పడ్డందుకు 25 ఏళ్ల జైలు శిక్ష

మైనర్ బాలికను లైంగికంగా వేదించిన కేసులో 25 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించిన నాంపల్లిలోని ప్రత్యేక పోక్సో న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. మైనర్ బాలికను లైంగికంగా వేధించిన గుట్ల శ్రీనివాస్ కు ప్రత్యేక కోర్టు ఈ శిక్ష విధించింది.

వివరాల్లోకి వెళితే 2023లో సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మైనర్ బాలికకు గుట్ల శ్రీనివాస్ సెల్ ఫోన్ ఇస్తానని ప్రలోభపెట్టి, నమ్మించి తన వెంట తీసుకెళ్లి లైంగికంగా వేధించాడు. బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి, అన్ని ఆధారాలను కోర్టు ముందు ప్రవేశపెట్టడంతో కోర్టు సాక్ష్యాధారాలను పరిశీలించి నిందితుడికి జరిమానా, 25 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించాలని కోర్టు తీర్పు చెప్పింది. పరిహారంగా బాలికకి 5 లక్ష రూపాయిలు చెల్లించాలని కోర్టు తీర్పులో పేర్కొంది.

బాలికలను, స్త్రీలను సెక్స్ ఆబ్జెక్టీవ్స్ గా చూసే వినిమయదారీ సంస్కృతి నశించనంతవరకు, స్త్రీ పురుష సంబంధాలలో ప్రజాస్వామిక సంస్కృతి వికసించనంతవరకు లైంగిక అత్యాచారాలు కొనసాగుతూనే వుంటాయని, కేవలం చట్టాలు, న్యాయస్థానాలు విధించే కఠిన శిక్షలు నేర ప్రవృత్తిలో ఎలాంటి మార్పులూ తీసుకురాలేవని సామాజిక చింతనాపరులు అనేక సందర్భాలలో తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేసిన విషయాన్ని మనం మరవకూడదు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు