Friday, 7 August 2026

చిట్టచివరి Gaza Hospitals పై ఇజ్రాయిల్ బాంబుల దాడి

ఇజ్రాయిల్ గాజాలోని ఒక చర్చ్ నిర్వహించే ఆసుపత్రి (Al-Ahli Arab Hospital) పై బాంబుల దాడి చేసింది – ఇది Anglican Church నిర్వహించే వైద్య కేంద్రం – దీని emergency మరియు pharmacy విభాగాలను ధ్వంసం చేసింది, వైద్య సిబ్బంది, రోగులు, ఆశ్రయం పొందుతున్నవారు అన్నివర్గాలవారినీ బలవంతంగా బయటకు పంపింది.

ఈ ఆసుపత్రి, ఉత్తర గాజాలో పనిచేస్తున్న చివరి కొన్ని ఆసుపత్రుల్లో ఒకటిగా ఉంది. ఈ బాంబుదాడి వల్ల ఒక చిన్నారి ప్రాణం కోల్పోయింది.

గాజా నుండి వస్తున్న కొన్ని వీడియోల్లో రాత్రిపూట రోగులను బెడ్లతో బయటికి పంపడం, కొందరు పగిలిన గాజు పెంకుల మీద నడుచుకుంటూ వెళ్ళడం, ఆకాశంలో పేలుళ్లు మెరుపుల్లా కనిపించడం చూడవచ్చు.

ఆసుపత్రి డైరెక్టర్ ఒక పెద్ద బాంబు గుంత పక్కన నిలబడి, ల్యాబ్, ఫార్మసీ, రిసెప్షన్, మరియు రోగులకు ఆశ్రయంగా ఉన్న చర్చ్ కూడా ఎలా నాశనమయ్యాయో వివరించారు.

ఇజ్రాయెల్ “హమాస్ ఆసుపత్రిని ఉపయోగించుకుంటోందని” ఆరోపించింది కానీ దానికి ఎలాంటి ఆధారాలు చూపలేదు. కానీ మన దగ్గర ఉన్న ఆధారం ఇదే: ఇజ్రాయెల్ గాజా వైద్య వ్యవస్థను ఒక్కొక్కటిగా ధ్వంసం చేస్తోంది.

ఇది కేవలం ఆసుపత్రిపై బాంబు దాడి కాదు – ఇది ఆశను, సేవను అందిస్తున్న చివరి చోటును తుడిచేసింది.

ఇదే నైన్యం మొదట ceasefire సమయంలో మందులు, సరఫరాలను అడ్డుకుంది. ఇప్పుడు మిగిలిన వైద్య వ్యవస్థను లక్ష్యంగా చేసుకుంది.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు