గత 18 నెలలుగా ఇజ్రాయెల్ గాజాలో పాలస్తీనీయులపై నిర్వహిస్తున్న మారణహోమానికి అమెరికా అధ్యక్షులు జో బైడెన్ మరియు ట్రంప్ కలిపి $35.76 billion విలువైన ఆయుధాలను ఇజ్రాయెల్‌కు ఆమోదించారు.
Brown University కి చెందిన “Cost of War Project” ప్రకారం, 2023 ముగిసిన తర్వాత బైడెన్ ఒక్కరే $23.76 billion విలువైన ఆయుధాలను ఇజ్రాయెల్‌కు మంజూరు చేశారు. ట్రంప్ తన అధ్యక్ష పదవిలో ప్రారంభ రెండు నెలల్లోనే మరో $12 billion విలువైన ఆయుధాలను ఆమోదించారు.
2023 ముగిసిన తర్వాత ఒక్కో american taxpayer నుండి సగటున $214 ఇజ్రాయెల్‌కి పంపిన ఆయుధాలకి కర్చు కాగ,
$36 మాత్రమే feseral homeless assistance grants కి,
$90 మాత్రమే పర్యావరణ పరిరక్షణ సంస్థ (environmental protection agency)కి,
$108 మాత్రమే Head Start బాలల విద్యా పథకానికి కర్చయ్యింది.
“మనదేశంలోనే అన్ని ప్రాంతాల్లో పరిశుద్ధ నీరు అందుబాటులో లేదు, కానీ మన పన్నులు గాజాలో నీటి వ్యవస్థల్ని ధ్వంసం చేయడానికి వెళ్తున్నాయి. మనకు సరైన ఆరోగ్య సేవలు లేవు, కానీ మన పన్నులతో గాజాలో ఆసుపత్రులపై బాంబులు వేస్తున్నారు. మన దేశంలోని పిల్లలు భోజనం మిస్సవుతుంటే, మన పన్నులతోనే గాజాలోని ప్రజలను ఆకలితో చంపుతున్నారు.” అంటూ అమెరికన్లు ఆవేధన చెందుతున్నారు.