Friday, 7 August 2026

Americaకి షాక్ ఇచ్చిన China – కీలక ఎగుమతుల నిలిపివేత

America, China మధ్య వాణిజ్య యుద్ధం రోజురోజుకి తీవ్రతరమవుతున్నది. సుంకాల విషయంలో America నిర్ణయాలకు ప్రతిగా China కూడా దిగుమతి సుంకాలని పెంచటంతో పాటు అరుదైన ఖనిజాలు, కీలకమైన లోహాలు, అయిస్కాంతాలను ఎగుమతి చేయడం నిలిపి వేసింది. ఈ దెబ్బకి Western countries లో ఆయుధాలు, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఏరో స్పేస్ తయారీ, సెమికండక్టర్లు తయారు చేసే కంపెనీలకు సమస్యలు ఎదురుకానున్నాయి.

ఎగుమతులకు సంబంధించిన నిబంధనలను China రూపొందిస్తున్నది. అప్పటివరకు China పొర్టుల నుంచి మాగ్నైట్ ఎగుమతులను నిలిపివేశారు. ఈ నిబంధనలు అమల్లోకి వస్తే కొన్ని కంపెనీలకు శాశ్వతంగా వీటి సరఫరా నిలిచిపోతుంది.

ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న అరుదైన ఖనిజాల్లో దాదాపు 90 శాతం China నుండే వెళుతున్నాయి. ఏప్రిల్ 2 నుండి China వీటి ఎగుమతులపై ఆంక్షలు విధించింది. ఈ లోటుని భర్తీ చేసుకోవడం Americaకి ఇబ్బందే. వాణిజ్య ఉద్రిక్తతలు ముదిరితే ఇలాంటి చర్యలు చేపడతామని China ఎప్పటి నుండో హెచ్చరిస్తున్నది.

ఐతే China తాజాగా చేపట్టిన చర్యల ప్రభావం కేవలం America వరకే పరిమితం కాదు. ఇది అన్ని దేశాలపై ఉండనుంది. కీలక ఖనిజాల మైనింగ్, ప్రాసెసింగ్ లో China తనకున్న శక్తిని ఆయుధంగా వాడుతున్నది. దీనితో పాటు Export Licenceలను పరిమితం చేసే అవకాశం కుడా వుంది. America లోని Tesla, Apple వంటి సంస్థలు చాలా ముడిపదార్ధాల కోసం China పైనే ఆధారపడుతున్నాయి. America వద్ద Rare Earth నిల్వలు ఇప్పటికీ వున్నాయి కానీ తమ Defence Contractor కు సరఫరా చేయడానికి మాత్రం ఇవి సరిపోవు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు