Friday, 7 August 2026

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి తప్పిన ప్రమాదం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నోవాటెల్ హోటల్‍లో రేవంత్ రెడ్డి ఎక్కిన లిఫ్ట్‌లో స్వల్ప అంతరాయం ఏర్పడింది. ఓవర్ వెయిట్‌తో ఉండాల్సిన ఎత్తు కంటే లిఫ్ట్ లోపలికి దిగిపోయింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి సహా అధికారులు, సిబ్బంది ఆందోళన చెందారు. ఏం జరుగుతుందో అర్థంకాక కాసేపు అయోమయానికి గురయ్యారు. అనంతరం పెద్ద ప్రమాదం ఏమీ లేదని తెలుసుకుని లిఫ్ట్ నుంచి బయటకు వచ్చేశారు. అనంతరం మరో లిఫ్ట్‌లో ముఖ్యమంత్రిని అధికారులు తరలించారు.

సీఎల్పీ సమావేశం సందర్భంగా నోవాటెల్ హోటల్ వద్దకు సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ విప్‌లు, కొంతమంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి ఆహ్వానం పలికి హోటల్ లోపలికి తీసుకెళ్లారు. అయితే పైఅంతస్తుకు వెళ్లే క్రమంలో 8 మంది ఎక్కాల్సిన లిఫ్ట్‌లో రేవంత్ రెడ్డితోపాటు 13 మంది ఎక్కారు. దీంతో లిఫ్ట్ ఉండాల్సిన స్థానం కంటే కిందికి కుంగిపోయింది. వెంటనే అలారం మోగడంతో అధికారులు, హోటల్ సిబ్బంది అప్రమత్తం అయ్యారు. హుటాహుటిన లిఫ్ట్ వద్దకు పరుగులు పెట్టారు. అనంతరం సీఎం సహా అందరినీ లిఫ్ట్ నుంచి బయటకు తీసుకువచ్చారు. అనంతరం మరో లిఫ్ట్‌లో సమావేశం జరుగుతున్న సెకండ్ ఫ్లోర్‌కు తీసుకెళ్లారు. రేవంత్ రెడ్డి ప్రమాదం నుంచి తప్పించుకోవడంతో ఎమ్మెల్యేలు, అధికారులు, హోటల్ సిబ్బంది అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు