Friday, 7 August 2026

అనుమతులు లేకుండా చెట్లు కొట్టేసినందుకు సీఎస్ సహా సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుంది: జస్టిస్ గవాయ్

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టులో ఈరోజు (బుధవారం) విచారణ ప్రారంభమైంది. జస్టిస్ బీఆర్ గవాయ్ నేత్రత్వంలోని ద్విసభ్య ధర్మాసనం దీన్ని విచారించింది. చెట్లు కొట్టేసి ముందు అనుమతులు తీసుకున్నారా లేదా స్పష్టంగా చెప్పాలని విచారణలో జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రశ్నించారు. 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అనుమతులు తీసుకున్నారో లేదో చెప్పాలన్నారు. అయితే అనుమతులతోనే ఆ భూముల్లో జామాయిల్ తరహా చెట్లు, పొదలను తొలగించినట్లు ప్రభుత్వం తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి కోర్టుకు చెప్పారు. తెలంగాణలో వాల్టా చట్టం అమలులో ఉందని, దాని ప్రకారం స్వయం అనుమతులుగా ప్రభుత్వం వ్యవహరించిందని అమికస్ క్యూరీ సుప్రీంకు వివరించారు. అనుమతులు తీసుకున్నారా లేదా అనుమతులు లేకుండా చెట్లు కొట్టేసినందుకు సీఎస్ సహా సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుందని జస్టిస్ గవాయ్ హెచ్చరించారు.

చీఫ్ సెక్రటరీని కఠినమైన చర్య నుంచి కాపాడాలనుకుంటే, ఆ వంద ఎకరాలను ఎలా పునరుద్ధరించాలో ఒక ప్రణాళికతో ముందుకు రావాలి. 1996 డిసెంబర్‌లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ఏమాత్రం వ్యవహరించినా చూస్తూ ఊరుకోం. మూడు రోజుల సెలవుల్లో అలా చేయడానికి అంత తొందర ఏమిటి? ఆ సెలవుల్లోనే బుల్డోజర్లు తీసుకొచ్చారు. పర్యావరణాన్ని కాపాడటానికి మేము ఇక్కడ ఉన్నాం. అధికారుల అనుమతి లేకుండా ఎన్ని చెట్లను నరికివేశారో అనే ఆందోళన మాత్రమే ఉంది. చెట్లను ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలి. మేము బుల్డోజర్ ఉనికి, 100 ఎకరాల అడవిని తొలగించడం గురించి మాత్రమే ఆందోళన చెందుతున్నాం. మీరు నిర్మించాలనుకుంటే, మీరు అనుమతులు తీసుకొని ఉండాలి అని జస్టిస్ అన్నారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు