Friday, 7 August 2026

పాఠశాలలో విష ప్రయోగం – వాటర్​ ట్యాంకులో, భోజన సామగ్రిపై పురుగుల మందు చల్లిన దుండగులు

ఆదిలాబాద్‌: ఇచ్చోడ మండ‌లం ధ‌ర్మ‌పురిలో విద్యార్థులపై విష‌ప్ర‌యోగం జ‌రిగింది. అయితే సిబ్బంది అప్ర‌మ‌త్తం వ‌ల్ల సుమారు 30మంది విద్యార్థుల‌కు ప్రాణ‌హాని త‌ప్పింది. విద్యార్థులు తాగేనీటి ట్యాంకులో దుండగులు పురుగుల మందు కలిపార‌ని సిబ్బంది గుర్తించారు. అలాగే మధ్యాహ్న భోజన సామాగ్రిపై కూడా చల్లారు. ధర్మపురిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం ప్ర‌తిభ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పాఠ‌శాల‌కు శనివారం, ఆదివారం సెలవులు రావడంతో సిబ్బంది పాఠశాలలో వంటగదికి తాళం వేసి వెళ్లారు. సోమవారం ఉదయం వంట చేసేందుకు పాత్రలు కడిగే సమయంలో చెడు వాసన, నురగలు వచ్చాయి. అప్రమత్తమైన సిబ్బంది చుట్టూ చూడగా పురుగుల మందు డబ్బా కనిపించింది. తాగునీటి ట్యాంకులోనూ దాన్ని కలిపినట్లు వారు గుర్తించారు. విద్యార్థులను తాగునీటి కుళాయిల వైపు వెళ్లకుండా చూశారు. మధ్యాహ్న భోజనం వండలేదు. దీంతో ఆ పాఠ‌శాల‌లో చ‌దువుతున్న 30మంది విద్యార్థుల‌కు పెను ముప్పు త‌ప్పింది. దీంతో గ్రామ‌స్థులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు