Friday, 7 August 2026

అమ్మాయిలుగా పుట్టినవారికి మాత్రమే చట్ట ప్రకారం జెండర్ పరంగా మహిళల గుర్తింపు: UK Supreme Court

అమ్మాయిలుగా పుట్టినవారికి మాత్రమే చట్టప్రకారం లింగ పరంగా మహిళల గుర్తింపు దక్కుతుందని యూకే సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పునిచ్చింది. సమానత్వ చట్టం 2010 లో “స్త్రీ” “లింగం” అనే పదాలు పుట్టుకతో అమ్మాయిలుగా పుట్టినవారిని, పుట్టుకతో ఏ లింగానికి చెందినవారు అన్న విషయాలను సూచిస్తాయని యూకే సుప్రీం కోర్టు ఏకగ్రీవ తీర్పునిచ్చింది.

ఈ తీర్పును ఒకటి లేదా మరిన్ని గ్రూపుల విజయానికి.. ఇంకో గ్రూపు చెల్లించిన మూల్యంగా చూడొద్దని, ఈ తీర్పు అర్ధం అదికాదని తాము సూచిస్తున్నట్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తి లార్డ్ హోడ్జ్ చెప్పారు. స్కాటిష్ ప్రభుత్వం, ఓ మహిళా గ్రూప్ మధ్య దీర్ఘకాలంగా జరిగిన న్యాయపోరాటం తర్వాత ఈ తీర్పు వెలువడింది. అయితే, ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు రక్షణ ఉందని న్యాయమూర్తి చెప్పారు.

లింగ గుర్తింపు సర్టిఫికెట్(జీఆర్‌సీ)తో ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు లింగ ఆధారిత రక్షణ హక్కు కలిగి ఉంటారన్నది స్కాటిష్ ప్రభుత్వం వాదన. ఆడపిల్లగా జన్మించిన వారికి మాత్రమే అవి వర్తిస్తాయని విమెన్ స్కాట్లాండ్ వాదించింది. స్కాటిష్ ప్రభుత్వం మార్గదర్శకాలు తప్పని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. స్కాట్లాండ్, ఇంగ్లండ్, వేల్స్‌లో లింగ-ఆధారిత హక్కులు ఎలా వర్తిస్తాయనే దానిపై ఈ తీర్పు విస్తృత ప్రభావాన్ని చూపవచ్చు. యూకే సుప్రీం కోర్టు తీర్పుతో స్కాటిష్ ప్రభుత్వంపై ఫర్ విమెన్ స్కాట్లాండ్ కేసు గెలిచినట్టయింది. ఫర్ విమెన్ స్కాట్లాండ్ గ్రూపు మద్దతుదారులు, ప్రచారకర్తలు సుప్రీం కోర్టు తీర్పు తర్వాత ఆనందభాష్పాలతో ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు