Friday, 7 August 2026

యూపీలో దారుణం 11 ఏళ్ల బధిర బాలికపై అత్యాచారం

ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాలో 11 ఏళ్ల వయస్సు గల బధిర మరియు మూగ (dumb and deaf) బాలికపై జరిగిన అత్యాచారం సంఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ బాలిక మంగళవారం సాయంత్రం నుండి కనిపించకుండా పోయింది. బుధవారం ఉదయం ఆమెను గ్రామానికి సమీపంలోని పొలాల్లో అపస్మారక స్థితిలో, తీవ్ర గాయాలతో, అర్ధనగ్నంగా కనుగొన్నారు.​

పోలీసులు ఈ కేసులో దాన్ సింగ్ అనే 24 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేశారు. అతను అదే గ్రామానికి చెందినవాడు. అతన్ని అరెస్టు చేసే ప్రయత్నంలో పోలీసులపై కాల్పులు జరిపాడు, తిరిగి పోలీసులు ఎదురుకాల్పులు జరిపటంతో అతని కాలికి గాయమవగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

బాలికకు మెరుగైన వైద్యం అందించేందుకు ఆమెను మీరట్‌లోని ఆసుపత్రికి తరలించారు. ఈ కేసును పోక్సో చట్టం కింద నమోదు చేశారు.​ ఆ చిన్నారికి చికిత్స అందించిన డాక్టర్ కీలక విషయాలు వెల్లడించారు. ఆమెపై ఒకరి కంటే ఎక్కువమంది అత్యాచారం చేశారని, ఆమె ముఖం మీద, ప్రైవేట్ భాగాల మీద గాయాలున్నట్లు ఆ డాక్టర్ తెలియచేశారు.

ఈ దారుణ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. బాధిత కుటుంబానికి న్యాయం కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు