Friday, 7 August 2026

Future City లో 1000 కోట్ల పెట్టుబడి జపాన్ పర్యటనలో తెలంగాణ ప్రభుత్వం బిగ్ డీల్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం జపాన్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. పర్యటనలో భాగంగా తొలి రోజునే భారీ పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. జపాన్‌కు చెందిన ప్రముఖ వ్యాపార సంస్థ Marubeni తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో అత్యాధునిక పారిశ్రామిక పార్క్‌ను ఏర్పాటు చేయడానికి Marubeni రెడీ అయింది. టోక్యోలో మరుబెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు.

Marubeni సంస్థ దాదాపు రూ. 1,000 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టును మొదలు పెట్టనుంది. ఫ్యూచర్ సిటీలో 600 ఎకరాల్లో ఈ పార్క్‌ను అభివృద్ధి చేస్తారు. దీనికి సంబంధించిన ఒప్పందంపై లెటర్ అఫ్ ఇంటెంట్ ముఖ్యమంత్రి సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, Marubeni ప్రతినిధులు సంతకాలు చేశారు. ఈ ఇండస్ట్రియల్ పార్క్‌లో జపాన్, ఇతర దేశాల కంపెనీలు తమ తయారీ యూనిట్లను ఏర్పాటు చేస్తాయి. దీని ద్వారా దాదాపు రూ. 5,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు. Marubeni ఇండస్ట్రియల్ పార్క్ ప్రధానంగా ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఫార్మా, ప్రెసిషన్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలపై దృష్టి పెడుతుంది.

కాగా, Marubeni ప్రపంచవ్యాప్తంగా 65 దేశాలలో 410కి పైగా గ్రూప్ కంపెనీల ద్వారా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆహారం, వ్యవసాయ ఉత్పత్తులు, లోహాలు, గనులు, ఇంధనం, విద్యుత్, కెమికల్స్, మౌలిక సదుపాయాలు, ఫైనాన్స్ లీజింగ్, రియల్ ఎస్టేట్, ఏరోస్పేస్, మొబిలిటీ వంటి రంగాలలో ఈ కంపెనీ అగ్రగామిగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 50,000 మంది ఉద్యోగులను నియమించుకుంది.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు