ప్రముఖ క్రికెటర్ సంజయ్ బంగర్ కుమార్తె అనయ బంగర్ తన లైంగిక మార్పు ప్రయాణం మరియు క్రికెట్ ప్రపంచంలో ఎదుర్కొన్న అనుభవాల గురించి ఓ ఇంటర్వ్యూలో వివరించారు. అనయ, పూర్వంలో ఆర్యన్ బంగర్‌గా గుర్తింపు పొందిన ఆమె, హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ, లైంగిక గుర్తింపు శస్త్రచికిత్స తర్వాత అనయగా మారారు. ఈ మార్పు తర్వాత ఆమెకు క్రికెట్ వర్గాల్లో కొన్ని అసౌకర్యకరమైన అనుభవాలు ఎదురయ్యాయని తెలిపారు.
ఒక ఇంటర్వ్యూలో, అనయ కొన్ని క్రికెటర్లు తనకు అనుచితమైన ఫోటోలు పంపారని, లైంగికంగా వేధించారని ఆరోపించారు. ఒక వెటరన్ క్రికెటర్ తో తన బాధని పంచుకున్నప్పుదు అంతా విని, కార్ ఎక్కమని అన్నారని, తరువాత “sleep with me” అన్నారని ఆమె చెప్పారు. ఇలాంటి అనుభవాలు ఆమెను మానసికంగా బాధించాయని, క్రికెట్ ప్రపంచంలో లైంగిక వివక్ష ఇంకా ఉందని చెప్పారు.
అనయ తన చిన్ననాటి నుండి మహిళగా మారాలనే కోరిక కలిగి ఉన్నారని, ఎనిమిదో లేదా తొమ్మిదో ఏట తన తల్లి దుస్తులు ధరించి అద్దంలో చూసుకునేవారని తెలిపారు. తన తండ్రి ప్రసిద్ధ క్రికెటర్ కావడం వల్ల తన లైంగిక గుర్తింపును గోప్యంగా ఉంచాల్సి వచ్చిందని చెప్పారు.
తండ్రి సంజయ్ బంగర్ మాదిరిగానే అనయ బంగర్ కూడా క్రికెట్ నే కెరీర్ గా ఎంచుకోవాలనుకున్నారు. సర్జరీకి ముందు అబ్బాయి (ఆర్యన్)గా వున్న కాలంలో దేశవాళీ క్రికెట్ కూడా ఆడారు. ఇప్పటి ప్రముఖ క్రికెటర్లు సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్, యశశ్వి జైశ్వాల్ తో కలిసి ఆడారు. ఐతే సర్జరీ చేయించుకున్నాక క్రికెట్ ఆడటానికి ఐసిసి నిబంధనలు అడ్డం వచ్చాయి. మహిళల క్రికెట్లో Transgenders కి అవకాశం లేదని ఐసిసి నిబంధనలు తీసుకురావడంతో ఆమెకి క్రికెట్ ఆడే అవకాశం పోయింది. ఈ విషయంపై అనయ సోషల్ మీదియా వేదికగా తన నిరసనని తెలియచేశారు. “క్రికెట్ ప్రపంచం అభద్రత, విషపూరిత పురుషత్వంతో నిండి వుంది” అని ఆమె అన్నారు.
అనయ ప్రస్తుతం యునైటెడ్ కింగ్‌డమ్‌లో నివసిస్తున్నారు. ఆమె క్రికెట్‌లో లైంగిక సమానత్వం కోసం పోరాడుతున్నారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) Transgender క్రీడాకారులను మహిళల క్రికెట్‌లో పాల్గొనకుండా చేసిన నిర్ణయాన్ని ఆమె నిరసించారు.
ఈ ఇంటర్వ్యూలో అనయ తన అనుభవాలను పంచుకోవడం ద్వారా క్రికెట్ ప్రపంచంలో లైంగిక సమానత్వం మరియు ట్రాన్స్‌జెండర్ హక్కులపై చర్చను ప్రారంభించారు.