Friday, 7 August 2026

NIMS లో అగ్నిప్రమాదం

హైదరాబాద్ పంజాగుట్టలో వున్న ప్రతిష్టాత్మక NIMS (Nizam’s Institute of Medical Sciences) ఆసుపత్రి ఎమర్జెన్సీ విభాగం భవనతిలో శనివారం అగ్ని ప్రమాదం సంభవించింది. 5వ ఫ్లోర్ లో హఠత్తుగా మంటలు చెలరేగాయి. కిటికీల నుండి దట్టమైన పొగలు రావడంతో అందరూ భయభ్రాంతులకు గురయ్యారు.

ఘటన జరిగిన వెంటనే ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు మరియు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. ఫైర్ ఇంజిన్లు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాద సమయంలో రోగులను సురక్షితంగా ఖాళీ చేయించారు.

ఈ ప్రమాదం సమయంలో ఐదో అంతస్తులో మెడికల్ గ్యాస్ట్రో మరియు సర్జికల్ గ్యాస్ట్రో విభాగాలు ఉన్నాయి. పొగలు ఎక్కువగా రావడంతో రోగులు, సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు. సిబ్బంది అద్దాలను పగులగొట్టి పొగను బయటకు వెళ్లేలా చేశారు.

మొత్తానికి అగ్నిప్రమాద సంఘటన ఎంత భయపెట్టినా ఎవరికీ ఎలాంటి గాయాలు తగలకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నప్పటికీ ఈ సంఘటనని ఆసుపత్రి వర్గాలు, ప్రభుత్వం ఓ బలమైన హెచ్చరికగా తీసుకోవాల్సి వుంది.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు