Friday, 7 August 2026

డిజిటల్ రేప్ అంటే: మేదాంత ఆసుపత్రి ఘటన

డిజిటల్ అనే పదం వినగానే కంప్యూటర్ లేదా ఆన్‌లైన్, టెక్నాలజీ సంబంధించినదిగా అనుకుంటాం. కానీ, డిజిటల్ రేప్‌కు కంప్యూటర్ లేదా ఆన్‌లైన్ వ్యవహారాలకూ ఎలాంటి సంబంధం లేదు. డిజిట్ నుంచి ‘డిజిటల్ రేప్’ అనే పదం పుట్టుకొచ్చింది. ఇంగ్లీష్‌లో డిజిట్ అంటే అంకె. అలాగే, చేతి వేలు, బొటన వేలు లేదా కాలి వేలు అనే అర్థం కూడా ఉంది. డిజిటల్ రేప్ అంటే చేతి వేళ్లు లేదా కాలి వేళ్లను బలవంతంగా మహిళల (లేదా పురుషుల) ప్రైవేట్ భాగాల్లోకి చొప్పించి, లైంగిక హింసకు పాల్పడటం. శరీర భాగాలను (పురుషాంగం కాకుండా) లేక వస్తువులు, పరికరాలను మహిళల యోనిలోకి, మూత్ర మార్గం లేదా మల ద్వారంలోకి చొప్పించడం లేదా మహిళలతో బలవంతంగా ఆ పని చేయించడాన్ని రేప్ అంటారు. దీన్నే డిజిటల్ రేప్‌గా వ్యవహరిస్తున్నారు.

డిజిటల్ అత్యాచారం అంటే.. బాహ్య సంబంధంతో కూడిన లైంగిక వేధింపుల రూపాల మాదిరిగా ఉండదు. సాధారణంగా చేతి వేళ్లు లేదా కాలి వేళ్లను ఉపయోగించి చేసే లైంగిక హింస. ఇటువంటి దాడులు ఆసుపత్రులు, బహిరంగ ప్రదేశాలు లేదా పోలీసు కస్టడీలో కూడా అనేక రకాల వాతావరణాలలో జరగవచ్చు. డిజిటల్ అత్యాచారం ఫలితంగా వచ్చే గాయం తరచుగా శారీరక హాని, దీర్ఘకాలిక భావోద్వేగ, మానసిక ప్రభావాన్ని కలిగి ఉంటుంది.

2021లో జరిగిన కేసులో రెండేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడినందుకు ఢిల్లీ కోర్టు ఒక వ్యక్తికి 25 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది.

 

మేదాంత ఆసుపత్రి కేసు వివరాలు:

గురుగ్రామ్ లోని ఓ హోటల్ స్విమ్మింగ్ పూల్ లో ఎయిర్ హోస్టెస్ జారి పడింది. వెంటనే ఆమెను మేదాంత ఆసుపత్రిలో చేర్పించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న సమయంలో ఆమెపై ఆసుపత్రి సిబ్బంది లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న ఎయిర్ హోస్టెస్ పై ఆసుపత్రి సిబ్బంది లైంగిక దాడి చేశారు. తనపై లైంగిక దాడి జరిగినట్లు ఏప్రిల్ 14న 46 ఏళ్ల ఎయిర్ హోస్టెస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.

దీపక్ (25), బీహార్‌కు చెందిన వ్యక్తి. అతను మేదాంత ఆసుపత్రిలో టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. విచారణలో అతను దాడికి ముందు, తర్వాత పోర్న్ వీడియోలు చూశాడని వెల్లడించారు. దాడి సమయంలో గదిలో ఇద్దరు నర్సులు ఉన్నారని, కానీ వారు ఏమీ చేయలేదని బాధితురాలు పేర్కొన్నారు .

బాధితురాలు ఏప్రిల్ 13న డిశ్చార్జ్ అయిన తర్వాత తన భర్తకు విషయం చెప్పి, సదర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, ఆసుపత్రి సిబ్బందిని విచారిస్తున్నారు. ఆసుపత్రి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. 8 బృందాలు 4 రోజుల పాటు వేట సాగించాయి. 800 సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించాయి. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేశాయి.కాగా, ఈ తరహా నేరాన్ని లీగల్ భాషలో ‘డిజిటల్ రేప్’ అని అంటారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు