Close Menu
BTJ
  • Home
  • UK News
    • Political
    • Crime
      • UK Crime Files
    • Cinema
    • Culture
    • Sports
  • AP/TS News
    • Political
    • Crime
    • Cinema
    • Culture
    • Sports
  • World News
    • Political
    • Crime
    • Cinema
    • Culture
    • Sports
  • వెన్నెల
    • Kidsoochi
    • Health & Fitness
  • Business
  • History & Context
  • Thinking Aloud
    • Radical Thinkers
  • అవీ ఇవీ
  • Movie Reviews
    • Local
    • Global
  • Book Reviews
    • Contemporary Reading
    • Popular Literature
  • Click book
Facebook X (Twitter) Instagram WhatsApp Telegram
Trending:-
  • ట్రకోమా రహిత దేశంగా భారత్: మోదీ
  • ఎట్టి పరిస్థితుల్లోనూ 2027 నాటికి పోలవరం పూర్తి: చంద్రబాబు
  • షఫాలీ మృతికి కారణమేమిటి?
  • గోల్కొండ కోటలో బోనాల సందడి
  • ఆర్‌సీబీ ప్లేయర్‌ యష్‌ దయాల్‌పై కేసు
BTJBTJ
Monday, June 30
  • Home
  • UK News
    • Political
    • Crime
      • UK Crime Files
    • Cinema
    • Culture
    • Sports
  • AP/TS News
    • Political
    • Crime
    • Cinema
    • Culture
    • Sports
  • World News
    • Political
    • Crime
    • Cinema
    • Culture
    • Sports
  • వెన్నెల
    • Kidsoochi
    • Health & Fitness
  • Business
  • History & Context
  • Thinking Aloud
    • Radical Thinkers
  • అవీ ఇవీ
  • Movie Reviews
    • Local
    • Global
  • Book Reviews
    • Contemporary Reading
    • Popular Literature
  • Click book
BTJ
Home»AP/TS News

లగచర్లలో జరిగిన ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) దర్యాప్తు బృందం సంచలన విషయాలు వెల్లడి

April 21, 2025No Comments2 Mins Read
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

వికారాబాద్ జిల్లా లగచర్లలో జరిగిన ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) దర్యాప్తు బృందం సంచలన విషయాలు వెల్లడించింది. ఫార్మా సిటీ కోసం భూసేకరణపై జరిగిన ప్రజా విచారణ సందర్భంగా నిరసన తెలిపిన రైతులను పోలీసులు కొట్టి, శారీరకంగా హింసించారని NHRC నిర్ధారించింది.

ఈ మేరకు కమిషన్ తాజాగా నివేదికను విడుదల చేసింది.2024 నవంబర్‌లో వికారాబాద్ జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులు ఫార్మా సిటీ భూసేకరణపై ప్రజా విచారణకు లగచర్లకు వచ్చినప్పుడు, గ్రామస్థులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కొందరు రైతులు అధికారులపై దాడి చేశారనే ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేశారు. పరిగి పోలీస్ స్టేషన్‌లో లగచర్లకు చెందిన పలువురు రైతులను అరెస్టు చేసి, పోలీసులు వారిని శారీరకంగా హింసించారని NHRC దర్యాప్తులో తేలింది.

నిరసన జరిగిన సమయంలో సంఘటన స్థలంలో లేని అనేక మందిని పోలీసులు అరెస్టు చేశారని, అంతేకాకుండా ఇళ్లలో ఉన్న మహిళలను కూడా పోలీసులు వేధింపులకు గురిచేశారని నివేదిక పేర్కొంది. కొందరు మహిళలు లైంగిక వేధింపులకు కూడా గురయ్యారని ఆరోపించారు. ఒక మహిళ‌కు ఎడమ తొడపై (4cm x 5cm) గాయమైందని డాక్టర్ ధృవీకరించారు. రాత్రిపూట అరెస్టు చేసిన గ్రామస్థులను పరిగి పోలీస్ స్టేషన్‌లో కొట్టి, హింసించారని, మేజిస్ట్రేట్ ముందు ఈ హింస గురించి చెప్పవద్దని పోలీసులు వారిని బెదిరించారని NHRC తన రిపోర్ట్‌లో స్పష్టం చేసింది.

ఈ ఘటనలో రాజకీయ కక్ష కూడా స్పష్టంగా కనిపిస్తోందని కమిషన్ అభిప్రాయపడింది. ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలను పోలీసులు ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకున్నారని, ఘటనతో ఎలాంటి సంబంధం లేకపోయినా వారిని అరెస్టు చేసి హింసించారని NHRC పేర్కొంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఒక్క కాంగ్రెస్ మద్దతుదారుడిపై కూడా కేసు నమోదు చేయలేదని, ఎవరినీ అరెస్టు చేయలేదని నివేదికలో వెల్లడించడం గమనార్హం.

కేవలం రాజకీయ నాయకులు, కార్యకర్తలనే కాకుండా, ఘటనతో సంబంధం లేకపోయినా మైనర్లు, విద్యార్థులు, ప్రభుత్వ అధికారులపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారని NHRC దర్యాప్తు బృందం తన రిపోర్ట్‌లో స్పష్టం చేసింది. దర్యాప్తు బృందం ఈ విషయాన్ని నిర్ధారించి, హింస చెలరేగకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అమాయకులపై చర్యలు తీసుకొవద్దని.. పోలీసులు, అధికారులు మానవ హక్కులను కాపాడేలా వ్యవహరించాలని సూచించింది. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూసుకోవాలని హెచ్చరించింది. ఈ ఘటనపై 6 వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

Author

  • britishtelugujournal
    britishtelugujournal

    View all posts
Add to Bookmark Bookmark
Human Rights Violation Lagadcherla Incident Land Acquisition Protest. Farmers Rights NHRC Report Pharma City Protest Police Brutality India Political Targeting Telangana News Vikarabad District
Previous Articleగాట్విక్‌ విమానాశ్రయం (Gatwick Airport) బ్రిటన్‌లో అత్యధిక delays ఉన్న విమానాశ్రయంగా వరుసగా రెండో సంవత్సరం గుర్తింపు పొందింది.
Next Article ఒక పక్క ఆరోపణలు మరో పక్క ఆదేశాల ఇవ్వాలా అన్న సుప్రీం కోర్టు.
Add A Comment
Leave A Reply Cancel Reply

Top Posts

హంతక తండ్రి -హబ్సీగూడలో దారుణం

March 12, 2025

అప్రమత్తతతో చూడాల్సిన సినిమా “కోర్ట్”!

March 17, 2025

“పోటీ ఒత్తిడికి బలైన తండ్రి – కన్నబిడ్డల హత్యతో ముగిసిన విషాద కథ!”

March 18, 2025

అడవిలో కురిసిన రంగుల వాన: కాళ్ళ సత్యనారాయణ

February 5, 2025
Don't Miss

ట్రకోమా రహిత దేశంగా భారత్: మోదీ

india news June 30, 2025

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2025 జూన్ 29న తన ‘మన్ కీ బాత్’ 123వ ఎపిసోడ్‌లో ప్రపంచ ఆరోగ్య…

Add to Bookmark Bookmark

ఎట్టి పరిస్థితుల్లోనూ 2027 నాటికి పోలవరం పూర్తి: చంద్రబాబు

June 30, 2025

షఫాలీ మృతికి కారణమేమిటి?

June 30, 2025

గోల్కొండ కోటలో బోనాల సందడి

June 30, 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Instagram
  • YouTube
Facebook X (Twitter) WhatsApp Instagram

News

  • World
  • US Politics
  • EU Politics
  • Business
  • Opinions
  • Connections
  • Science

Company

  • Information
  • Advertising
  • Classified Ads
  • Contact Info
  • Do Not Sell Data
  • GDPR Policy
  • Media Kits

Services

  • Subscriptions
  • Customer Support
  • Bulk Packages
  • Newsletters
  • Sponsored News
  • Work With Us

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

© 2025 British Telugu Journal.
  • Privacy Policy
  • Terms

Type above and press Enter to search. Press Esc to cancel.