పాపులారిటీ ఎవరికి ఇష్టం ఉండదు? మరి పాపులారిటీ ఎలా వస్తుంది? 100 కి 99 మందికి ఇష్టం. టిక్ టాక్, ఇంస్టాగ్రామ్, మోజ్, రోపోసో ఇవన్నీ రీల్స్ చేశే యాప్స్. ఇందులో రక రకాల వయసు వాళ్ళు రక రకాలుగా చేస్తూ పెడుతుంటారు. అందులో కొంతమంది సెక్సీ గా, రెచ్చగొట్టే విధంగా, హీరోయిన్ల మాదిరిగా బట్టలు వేసుకొని కూడా రీల్స్ చేసి పెడతారు.
ఎందుకంటే వాళ్ళు పాపులర్ కావలి అని, గుర్తింపు పొందాలి అని, లైక్ లు రావాలి అని తమ టాలెంట్ చూపాలనే అనే ఉద్దేశ్యంతో చేస్తారు. అక్కడ చేశేది నటన ఏ కదా. వాళ్ళేమి వచ్చే పబ్లిక్ గా చేయడం లేదు కదా. కేవలం సమంతా, పూజ, కృతి శెట్టి, సాయి పల్లవి వీళ్ళే నటించాలా? మాములు వాళ్ళు ప్రయత్నం చేయకూడదా? ఇంట్లో కూర్చుంటే ఎవరు రమ్మని పిలవరు కదా.
లేదు టైం పాస్ కోసం చేస్తారు, ఇంట్రెస్ట్ ఉంది అని చేస్తారు, ఇంతవరకు ఇలాంటి అవకాశాలు లేవుకాబట్టి చేయలేదు, ఇప్పుడు ఓ అవకాశం వచ్చింది చేస్తున్నారు. అందుకు వాళ్ళ కుటుంబసభ్యులు కూడా సరే అంటున్నారు. అలాంటప్పుడు మనకెందుకు బాధ? ఈ మాములు అమ్మాయిలు, మహిళలు పద్దతిగా ఎవరూ వాళ్ళను తప్పు పట్టకుండా వాళ్ళు సమాజంలోని విలువలు కట్టుబాట్లు సంప్రదాయాలు పాడుకాకుండా రీల్స్ చేయాలా?
అలా కాకుండా ఏ మాత్రం ఎక్సపోసింగ్ చేసినా, రెచ్చగొట్టే మాదిరిగా చేసినా వాళ్ళు మొత్తం సమాజాన్ని బ్రష్టు పట్టిస్తున్నారు, వాళ్ళు విలువలు పోగొడుతున్నారు, ఈ తరం వాళ్ళు వెర్రి తలలు వేస్తున్నారు ఇలా వాళ్ళ గురించి రాయాలి తిట్టాలి అంతే కదా. వీళ్లంతా ఇలా మాట్లాడటానికి కారణం అభద్రతా భావం, వారిని చూసి తమ వాళ్ళు పాడు అయిపోతారేమో అనే భయం.
ఎవరి స్థాయిలో వాళ్లకున్న అనుభవంతో వాళ్ళ ఇష్టమొచ్చిన విధంగా రీల్స్ చేసుకుంటారు, చూస్తూ చూడండి లేకపోతె వదిలెయ్యండి, వాళ్ళ గురించి మోరల్ పోలీసింగ్ చేయడం ఎందుకు? నాయకులు, సెలబ్రెటీలు నాశనం చేయడం లేదా? హీరోయిన్ ఎక్సపోజ్ చెయ్యవచ్చు, రచయితలూ డబులు మీనింగ్ డైలాగ్స్ పాటలు రాయవచ్చు, దర్శకుడు పూలు పండ్లు బొడ్డుమీద వేసి క్లోజప్ షాట్లు చూపవచ్చు, ఇవన్నీ చేసినా సమాజంలోని విలువలు, సంప్రదాయాలు, ఏవి పాడుకోవడం లేదు, ఈ రీల్స్ చేసిన వారి వల్లే మొత్తం నాశనం అవుతున్నాయి.
దేశంలోని పేరు మోసిన హీరోలు వచ్చి గుట్కాలు తినండి, సిగరెట్లు తాగండి, కూల్ డ్రింక్స్ తాగండి అంటూ చెబుతుంటే మాత్రం సమాజం బాగుపడిపోతుందా? వాళ్ళ సినిమాలు చూడటానికి సంకలు గుద్దుకుంటూ పోతారా కదా, అప్పుడు ఒక్క క్షణం కూడా వాళ్ళు చేస్తున్నది తప్పు, వీళ్ళ వలన సమాజం పాడుఅవుతుంది అనిపించడలేదా?
ఇలా రీల్స్ చేశే వాళ్ళ గురించి చెడుగా మాట్లాడుతారు, చెడ్డ కామెంట్లు పెడతారు. ఇక్కడ తిట్టవలసింది మాట్లాడవలసింది కామెంట్స్ పెట్టేవాళ్లను కాని ఆ రీల్స్ చేశే వాళ్ళను ఎందుకు తిట్టాలి? ఆ రీల్స్ ఎలా చేసుకోవం అనేది వాళ్ళ ఇష్టం కదా, అదేంటి అందులో వాళ్ళు చాల ఘోరంగా తీస్తున్నారు, ఘోరంగా తీస్తే నాలుగు రోజులకు వాళ్ళకే అర్థం అవుతుంది. తరువాత ఆపేస్తారు. వాళ్ళను సమర్థించడం వ్యతిరేకించడం కాదు, ఒకరు చేశేది ఇంకొకరికి నచ్చకపోవొచ్చు, ఈ నచ్చకపోవడం అనేదానికి ఒక కొలత అంటూ లేదు. పూర్తిగా బాగాలేకపోతే చట్టాలు ఉన్నాయి, పోలీసులు ఉన్నారు, కోర్టులు ఉన్నాయి. ఎదుటివాళ్లను జడ్జ్ చేయడం కామెంట్ చేయడం ఎప్పటికి మానేస్తాం మనం?