2025లో నెట్ఫ్లిక్స్లో అత్యంత ప్రజాదరణ పొందిన షోలలో ‘Adolescence’ ఒకటి. ఇది 13 ఏళ్ల జామీ అనే బాలుడి గురించిన బ్రిటిష్ డ్రామా. ఆన్లైన్లో తన క్లాస్మేట్ ఒకమ్మాయి సైబర్ వేధింపులకు గురిచేస్తున్నదని భావించి ఆమెని కత్తితో పొడిచి చంపినట్లు అనుమానించబడినందున అతను అరెస్టు చేయబడతాడు.
ఈ కల్పిత షో నిజ జీవిత ప్రభావాన్ని చూపుతోంది. టీనేజర్ల మానసిక ఆరోగ్యం, పిల్లల స్మార్ట్ఫోన్లపై సోషల్ మీడియాను ఎంతవరకు పరిమితం చేయాలి అనే దాని గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చను ఈ షో ప్రారంభిస్తోంది.
UK ప్రధాన మంత్రి Keir Starmer ఈ షోను వీక్షించారు. Policy actions చర్చించడానికి ఛారిటీ సంస్థలను, షో సృష్టికర్తలు స్టీఫెన్ గ్రాహం (జామీ తండ్రిగా నటించారు), జాక్ థోర్న్లను కలిశారు. వారిని ఆన్లైన్ భద్రతపై పార్లమెంటరీ సమావేశాలకు ఆహ్వానించారు.
14 ఏళ్లలోపు పిల్లలకు తమ స్మార్ట్ఫోన్లలో సోషల్ మీడియా యాక్సెస్ ఉండటాన్ని థోర్న్ ఒప్పుకోడు. కొన్ని డచ్ పాఠశాలలు తరగతి గదుల్లో ‘Adolescence’ షో ను ప్రదర్శిస్తాయి. నెట్ఫ్లిక్స్ UK అంతటా ఉన్న మాధ్యమిక పాఠశాలల్లో ఈ షోను ఉచితంగా చూసేలా చేస్తోంది. షో సృష్టికర్తలు విద్యార్థులు ఏమి ఎదుర్కొంటున్నారో దాని గురించి మాట్లాడటానికి పాఠశాలలను సందర్శిస్తున్నారు.
“మేము సంభాషణకు నాంది పలుకుతున్నాం” అని థోర్న్ చెప్పారు. ”విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఇంకా వారి ఉపాధ్యాయుల మధ్య వారు ఏమి అనుభవించారు, దానిని వారు ఎలా ఎదుర్కోగలరని అనుకుంటున్నారు అనే దాని గురించి చర్చను సృష్టించడానికి ప్రయత్నించడం ముఖ్య ఉద్దేశ్యం.” అని అన్నారు.