జమ్ముకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్‌లోని 36 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని గురువారం రాత్రి పాకిస్థాన్ 300 నుంచి 400 డ్రోన్లతో దాడులకు తెగబడింది. అయితే, దూసుకొస్తున్న ఈ డ్రోన్లను గాలిలో ఉండగానే తుత్తునియలు చేయడంలో ఆకాశ్ సర్ఫేస్ టూ ఎయిర్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ కీలక పాత్ర పోషించింది. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఈ రక్షణ వ్యవస్థ గురించి ఇప్పుడు అంతటా చర్చ మొదలైంది.
ఆకాశ్-ప్రత్యేకతలు
పేరు: ఆకాశ్ సర్ఫేస్ టూ ఎయిర్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్
అభివృద్ధి చేసింది: స్వదేశీ పరిజ్ఞానంతో భారత్
పరిధి: 4.5 కిలోమీటర్ల నుంచి 25 కిలోమీటర్లు
క్షిపణి వేగం: గంటకు 4,320 కిలోమీటర్లు (సూపర్ సోనిక్ (మాక్ 2.5-3.5))
లాంచింగ్ ప్లాట్‌ఫామ్: మొబైల్ లాంచర్లు (ట్రక్కు లేదా వాహనాలు)
వేటిని కూల్చగలదు?: డ్రోన్లు, ఫైటర్ జెట్లు, హెలికాప్టర్లు, క్రూయిజ్ క్షిపణులు
స్పెషాలిటీ: ఏక కాలంలో ఏ దిశ నుంచి వచ్చిన బహుళ డ్రోన్లనైనా కచ్చితత్వంతో కూల్చగలదు.
వార్‌హెడ్ బరువు: సుమారు 60 కిలోలు
రాడార్ రకం: రాజేంద్ర రాడార్ (లక్ష్యాల కూల్చివేత, గుర్తింపు)