ఈ రోజు తల్లుల ప్రేమ, సంరక్షణ, త్యాగాలకు గౌరవంగా ప్రత్యేకంగా వేడుకగా జరుపుకుంటారు. మదర్స్ డే వేడుకలు అమెరికాలో 20వ శతాబ్ద ప్రారంభంలో మొదలయ్యాయి. అన్నా జార్విస్ అనే మహిళ 1908లో తన తల్లిని గౌరవించేందుకు ఈ వేడుకను ప్రారంభించింది. 1914లో అమెరికాలో అధికారిక సెలవు దినంగా ప్రకటించబడింది.
ఈ రోజును ఇండియా లో కూడా చాలామంది జరుపుకుంటున్నారు. అధికారికంగా అయితే ఎలాంటి సెలవు కాని వేడుకులు కాని జరపరు. అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చుకుంటే అక్కడి కుటుంబ విధానం కుటుంబ సంస్కృతి మహిళల ఆర్థిక పరిస్థితి ఉపాధి పరిస్థితులు ఇండియా తో పోల్చుకుంటే ఇక్కడ మదర్స్ డే అనే ఒక ప్రత్యేకమైన రోజు అవసరం లేదేమో అనిపిస్తుంది.
ఇక్కడి కుటుంబ విధానం, సంస్కృతి లో ఇంట్లోని అందరు అమ్మ మీదే ఎక్కువగా ఆధారపడి జీవిస్తుంటారు. బాగా వయసు వచ్చిన తరువాత కొంతవరకు అమ్మతో అవసరం తగ్గిపోతుందేమో తప్ప ప్రతి రోజు అమ్మతో గడుపుతూనే అమ్మ సహాయం తీసుకుంటూనే ఉంటారు.
సుమారు 80-90% అమ్మలు ఇళ్లల్లోనే ఉంటారు. రోజంతా పిల్లల కోసం ఎదో ఒక పని చేస్తూనే ఉంటారు. బడికి తయారు చేసి పంపించడం నుండి ఉద్యోగానికి పోతూ కూడా అమ్మ సహాయం తీసుకుంటూనే ఉంటారు. పెళ్లి అయినా సరే ఎదో ఒక రూపంలో అమ్మ సహాయం తీసుకుంటూనే ఉంటారు.
ఇక్కడ ఎక్కువ మంది అమ్మ చేసే విషయాలను గ్రాంటెడ్ గా భావిస్తారు. అమ్మ చేస్తుందిలే ఎందుకు చెయ్యదు అనే భావనలో ఉంటారు. అమ్మ ఇంట్లోనే ఉంటుంది కదా ఎం పని ఉంది అనే ఒక భావనలో ఉంటారు. ఎందుకంటే ఇక్కడ సంపాదించేది మగవాళ్ళు కాబట్టి ఆడవాళ్ళ పనులకు ఎక్కువ విలువ ఇవ్వరు.
వాస్తవానికి ఒక ఉద్యోగి కన్నా వ్యాపారం చేసి సంపాదించే దాని కన్నా అమ్మ చేసేవి చాల చాల విలువైనవి. అది వంట కావొచ్చు, ఇల్లు అమర్చడం కావొచ్చు, పిల్లలను తయారు చెయ్యడం, వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని చక్కదిద్దడం కావొచ్చు, కుటుంబాల మధ్య బంధాలను నిలబెట్టడం ఇలా ఎన్నో విషయాలు అమ్మ వల్లే సరి అయిన మార్గంలో ఉంటాయి.
కాని ఎక్కువ మంది అమ్మకు విలువ ఇవ్వాలి గుర్తింపు ఇవ్వాలి అనే స్పృహలోనే ఉండరు. మదర్స్ డే వల్ల కొంతమంది అయినా ఈ రోజు అమ్మలకు ఎంతో కొంత గుర్తింపు ఇచ్చి ఆమెను సంతోష పెట్టడం చేస్తున్నారు. అమ్మలు కూడా చదువుకోవడం ఉద్యోగాలు చేయడం ఆర్థిక స్వతంత్రం ఏర్పడడం అలాగే పిల్లలు కూడా బాగా చదువుకోవడం వలన ఈ మార్పు మొదలయింది.
ఒకప్పటి అమ్మలతో పోల్చితే అమ్మల్లో చాల మార్పులు వచ్చాయి. అమ్మలు పిల్లల పెంపకంలో మార్పులు తెచ్చారు, పిల్లల విషయంలో నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు, సొంతంగా పిల్లలను తీసుకెళ్లడం తీసుకు రావడం చేస్తున్నారు, కొంతమంది సింగిల్ మదర్స్ గా జీవించగలుగుతున్నారు, కొంతమంది నాయకత్వం కూడా వహిస్తున్నారు ఇలా అన్ని రంగాల్లో అమ్మలు ముందుకు దూసుకుపోతున్నారు.