ఈ సినిమా ఎనౌన్స్ చేసినప్పటి నుంచి ఫాలో అవుతున్నా. టీజర్ అవి నచ్చాయి కానీ ట్రైలర్ చూసాక ఎందుకో ధియేటర్లో చూసే ధైర్యం చూడలేకపోయా.. ఎందుకో ఇదొక ఎమోషనల్ లవ్ ఫెయిల్యూర్ స్టోరీ ఏమో.. డైరక్టర్ అసలే చాలా టేలెంటెడ్.. ఏడిపించేస్తాడేమో.. ఓటీటీలో అయితే స్కిప్ ఆప్షన్ ఉంటుంది అని వెయిట్ చేసా.
నిన్న సినిమా మొదలెట్టా.. ఈరోజు ఫినిష్ చేసా..
ఇది ఒక పొయెట్రీ.. నచ్చే వాళ్ళకి చాలా నచ్చేస్తుంది. అర్ధం కాని వాళ్ళకి బోరింగ్ అనిపిస్తుంది.
ప్రేమ గురించి చెప్పే కొన్ని సీన్లు, డైలాగులు చాలా బాగున్నాయి. ఒక 50 కేజీల డంబెల్ ని గుండెల్లో మోస్తున్నట్టు ఉంది అని..
ప్రేమ మన నుంచి దూరం అయితే ఎలా ఉంటుందో తెలుసా అని సింబాలిక్‌గా గులాబి నుంచి ఒక రేకు వర్షంలో విడిపోతున్నట్టు చూపించడం చాలా బాగుంది.
ఇద్దరికి ఒకే రకమైన ఫీలింగ్స్ వచ్చి నిద్ర పట్టక సతమతమయ్యే సీన్ కూడా బాగుంది.
మన చుట్టూ చాలామందిని చూస్తూ ఉంటాం. కొందరు అమ్మాయిలు చాలా సక్సెస్‌ఫుల్, బ్యూటిఫుల్, టాలెంటెడ్ ఉండి కూడా వాళ్ళకి ఏదో ఒక లవ్ బ్రేకప్ ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్ళు అంత ఈజీగా దాని నుంచి బయటకి రాలేకపోవడం చూసి.. అసలు ఇలాంటి అమ్మాయిని దూరం చేసుకున్న వాడు నిజంగా వేస్ట్ ఫెలో.. అలాంటి వాడి కోసం ఫీలింగ్స్ వేస్ట్ చేసుకుంటున్నందుకు ఆ అమ్మాయి మీద జాలి పడతాం.
యాక్టువల్లీ మనం అనుకున్నంత సింపుల్ కాదు. ఎవరి లైఫ్ ఏక్స్పీరియన్స్ వాళ్ళకి మాత్రమే అర్ధం అవుతాయి. పెయిన్ లోంచి బయటపడడానికి చాలా కాలం పడుతుంది. ఇoనొకరికి దగ్గరవ్వడానికి ఉండే ఇన్సెక్యూరిటీస్ వాళ్ళకి మాత్రమే తెలుస్తాయి.
ఈ పాయింటును చాలా బాగా టచ్ చేసాడు డైరక్టర్..
ఇష్టపడేవాళ్ళకి దగ్గరవ్వడానికి చూపించే డిగ్నిటీ.. వాళ్ళకి దూరం అవ్వుతున్న్నపుడు కూడా చూపించాలి. ఒక ప్రోపర్ క్లోజర్ ఇవ్వాలి.
అంతే కాని వాళ్ళని గ్యాస్ లైటింగ్ చేసి.. బ్లేం చేసి మొత్తం వాళ్ళదే తప్పని చెప్పి జీవితంలోంచి వెళ్ళి పోతే వాళ్ళు కోలుకోలేరు అని బాగా చెప్పాడు.
ఇంకా ప్రేమించిన వాళ్ళని దూరం చేసుకోవడం కావాలని ఎవరూ చెయ్యరు..అలాంటి పరిస్తితులు వస్తాయి. ఒకప్పుడు హీరోయిన్ కి మొదటి హీరో వల్ల జరిగినదే ఆమె సెకoడ్ హీరో్‌కి కూడా చెయ్యల్సివస్తుందని.. ఏదీ జనరలైజ్ చెయ్యకూడదు.. ఎవరిని జడ్జ్ చెయ్యకూడదు అని కూడా బాగా చెప్పాడు..
సినిమా చాలా భాగం ఊటీలో, కొంత కాశ్మీరులో జరుగుతుంది. విజువల్లీ కట్టిపడేస్తుంది. డైలాగ్స్ సూటిగా గుండెలని తాకుతూ ఉంటాయి..
సినిమా సగం అయ్యేసరికి లవ్ బ్రేకప్ అయ్యి దాని నుంచి ఎలా బయట పడింది అన్నది కన్విన్సింగా చెప్పాడు.. అందరికీ మనం సరైన మార్గంలో వెళ్ళడానికి ఒక గురువు, కనీసం ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండాలి.. అలాంటి వాళ్ళని సంపాదించుకోగలిగితే లైఫులో ఎన్ని కష్టాలనైనా ఫేస్ చెయ్యచ్చు..
బ్రేకప్ అయ్యాక శుద్ధి, అదే హీరోయిన్ రెండవ బుక్ రాయడానికి దేశం అంతా తిరుగుతూ ఉంటుంది. సెకండ్ హీరోని వర్షంలో చూస్తుంది. అతను కూడా ఒక రైటర్ అని తెలిసాక ఇష్టపడుతుంది.
ముందు.. ఇది కొంచెం ఆర్టిఫీషియల్‌గా ఉంది కదా. ఎవరో ఒకరు ఆమె జీవితంలో రావాలని సెకండ్ హీరోని ఇరికించారు అన్న అబిప్రాయం లాస్ట్ 20 నిముషాల్లో మారుతుంది. ఒక రకంగా గూస్బంప్ మూమెంట్ అనుకోవచ్చు.. అప్పుడున్న డైలాగ్స్ చాలా బాగుంటాయి.
సినిమా ట్రాజిక్ స్టొరీలా ఎండ్ అవ్వదు..
ప్రేమ అంటే ఒక జర్నీ.. ఇష్టమైన వాళ్ళతో స్పెండ్ చేసిన ప్రతీ రోజు ఒక మెమరీ.. అలా సంవత్సరానికి 365 జ్ఞాపకాలు ఇచ్చావు అని చాలా బాగ చెప్తాడు సంజయ్.
నిజమైన ప్రేమ ఇన్స్పైర్ చేస్తుంది. మనల్ని మారుస్తుంది. పేమించిన వాళ్ళు దూరం అయితే మనల్ని మనం హర్ట్ చేసుకోవక్కర్లేదు.. ప్రేమ ఇచ్చిన స్పూర్తితో జీవితంలో ముందుకు సాగాలి అనే మంచి మెసేజితో సినిమా ముగుస్తుంది.
ఇంకా చాలా మంచి డైలాగులు సన్నివేశాలు ఉన్నాయి.
తప్పకుండా చూడాల్సిన సినిమా…
హీరోయిన్ చాలా బాగా చేసింది. డైరక్టర్ ఫణీంద్ర నరిశెట్టికి అభినందనలు..
– Author Sravan Kumar Dokka.