ఇండోనేషియాలో జులై 14, 2025న భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంపం తీవ్రత 6.7 నుండి 6.8గా నమోదైంది, తానిమ్బార్ దీవుల సమీపంలోని తూర్పు ఇండోనేషియా తీరంలో ఈ భూకంపం కేంద్రీకృతమైంది. అమెరికా జియోలాజికల్ సర్వే (USGS), జర్మనీ భూ పరిశోధనా కేంద్రం ప్రకారం ఈ భూకంపం భూమి ఉపరితలం నుండి 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది. అంబోన్‌కు దక్షిణ-ఆగ్నేయంగా 432 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించబడింది.
ప్రస్తుతానికి ఈ భూకంపం వల్ల ప్రాణ లేదా ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం లేదు. సునామీ హెచ్చరికలు కూడా జారీ కాలేదని అధికారులు తెలిపారు. ఇండోనేషియా, పసిఫిక్ ‘రింగ్ ఆఫ్ ఫైర్’లో ఉండటం వల్ల తరచూ భూకంపాలకు గురవుతుంది. గతంలో 2018లో సులవేసిలో 7.5 తీవ్రతతో సంభవించిన భూకంపం, సునామీలో 2,200 మందికి పైగా మరణించారు.