Thursday, 26 February 2026

అఫ్ఘానిస్థాన్‌లో భారీ భూకంపం.. 622 మంది మృతి

అఫ్ఘానిస్థాన్‌లో ఘోర ప్రకృతి విపత్తు సంభవించింది. గంటల వ్యవధిలో ఐదు సార్లు భూకంపం (Afghanistan Earthquake) రావడంతో భారీగా ప్రాననష్టం సంభవించింది. ఆదివారం రాత్రి 11.47 గంటల ప్రాంతంలో పాకిస్థాన్‌ సరిహద్దుల్లో ఉన్న కునార్‌ ప్రావిన్స్‌లో 6.0 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. నంగర్హర్‌ ప్రావిన్స్‌లోని జలాలాబాద్‌కు 27 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని ఎన్‌సీఎస్‌ వెల్లడించింది. దీంతో కునార్‌, లాఘ్‌మన్‌ ప్రావిన్సుల్లో భూప్రకంపణలు సంభవించాయి. చాలాచోట్ల భవనాలు కుప్పకూలిపోయాయి. దీంతో ఇప్పటివరకు 622 మంది మరణించారని తాలిబన్‌ ప్రభుత్వం ప్రకటించింది. మరో 1500 మందికిపైగా గాయపడ్డారని వెల్లడించింది.

భూకంపం ప్రభావం కునార్‌ ప్రావిన్స్‌లో అత్యధికంగా ఉన్నది. మృతుల్లో 610 మంది ఈ ప్రావిన్స్‌కు చెందినవారే ఉన్నారు. నంగర్హర్‌ ప్రావిన్స్‌లో 12 మంది ఉన్నారని అధికారులు తెలిపారు. కాగా, భూకంపం ధాటికి పలు గ్రామాల్లోని ఇండ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయని వార్దక్‌ ప్రావిన్స్‌ మాజీ మేయర్‌ జరీఫా ఘఫ్పారీ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. విపత్తు ధాటికి కునార్‌, నోరిస్థాన్‌, నంగర్హార్‌ ప్రావిన్సులు తీవ్రంగా నష్టపోయాయన్నారు. ఇండ్లు కూలిపోవడంతో పలు కుటుంబాలు వీధిన పడ్డాయని చెప్పారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులు తీవ్ర గాయాలపాలై ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని తెలిపారు. బాధితుల పరిస్థితి దుర్భరంగా ఉందని, కునార్‌ ప్రజలకు సహాయం అవసరమని వెల్లడించారు.

ప్రతి ఐదు నిమిషాలకు ఒకరు చొప్పున బాధితులు దవాఖానలో చేరుతున్నారని డాక్టర్‌ ములాదాద్‌ తెలిపారు. ఆయన కునార్‌ ప్రావిన్స్‌ రాజధాని అసదాబాద్‌లో ఉన్న ప్రావిన్సియల్‌ దవాఖానలో సేవలు అందిస్తున్నారు. ఇప్పటివరకు మహిళలు, చిన్నారులు సహా 188 మంది క్షతగాత్రులు దవాఖానలో చేరారరని వెల్లడించారు. ఇలాంటి పరిస్థితిని గతంలో తామెప్పుడూ చూడలేదని, హాస్పిటల్‌లో అత్యవసర పరిస్థితి విధించామని తెలిపారు. ప్రస్తుతం భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని అధికారులు తెలిపారు. కాగా, గతేడాది అఫ్ఘానిస్థాన్‌లో వరుసగా సంభవించిన భారీ భూకంపాల వల్ల 1000 మందికిపైగా మరణించారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు