Wednesday, 3 September 2025

అహ్మదాబాద్‌లో ‘2030 కామన్వెల్త్ క్రీడలు’- బిడ్ దాఖలుకు పచ్చజెండా – 2030

2030 సంవత్సరంలో కామన్వెల్త్ క్రీడలకు భారత్ ఆతిథ్యమిచ్చే బిడ్ దాఖలుకు కేంద్ర సర్కారు పచ్చజెండా ఊపింది. దీనిపై కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా శాఖ చేసిన ప్రతిపాదనకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. కామన్వెల్త్ క్రీడలను నిర్వహించేందుకు గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరాన్ని భారత సర్కారు ఎంపిక చేసింది. అహ్మదాబాద్‌లో ప్రపంచ స్థాయి స్టేడియంలతో పాటు సకల సౌకర్యాలతో క్రీడా శిక్షణా కేంద్రాలు ఉన్నాయని తెలిపింది.

ప్రపంచంలోనే అతి పెద్దదైన నరేంద్ర మోదీ స్టేడియం అహ్మదాబాద్‌లోనే ఉందని కేంద్రం గుర్తు చేసింది. 2023 ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్‌ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చిన నరేంద్రమోదీ స్టేడియంలోనూ ఈవెంట్స్ జరుగుతాయని వెల్లడించింది. కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యమిచ్చే అవకాశం భారత్‌‌కు దక్కితే, గుజరాత్ ప్రభుత్వంతో సహకార ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు, దానికి నిధులను ఇచ్చేందుకూ కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

72 దేశాల క్రీడాకారులు కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొననున్నారు. ఇప్పుడు భారత సర్కారు అనుమతి లభించడంతో, కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యాన్ని ఇచ్చే ఆసక్తిని వ్యక్తం చేస్తూ కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా శాఖ బిడ్‌ను దాఖలు చేయనుంది. చివరిసారిగా 2010లో దేశ రాజధాని న్యూ దిల్లీ వేదికగా ఈ క్రీడలకు భారత్ ఆతిథ్యం ఇచ్చింది. టూరిజం రెక్కలు తొడుగుతుంది.

పీఐబీ ‘అంతర్జాతీయ స్థాయి కలిగిన కామన్వెల్త్ క్రీడల నిర్వహణకు అవకాశం లభిస్తే, భారతదేశ టూరిజం రెక్కలు తొడుగుతుంది. ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఈతరానికి చెందిన ఎంతోమంది యువ అథ్లెట్లు వెలుగులోకి వస్తారు. మరెంతో మందికి ప్రోత్సాహకర వాతావరణం ఏర్పడుతుంది. అటువంటి గొప్ప క్రీడా ఉత్సవాన్ని నిర్వహించే అవకాశం దక్కడం మన దేశానికే గర్వకారణంగా నిలుస్తుంది. భారతదేశ నైతిక బలం మరింత పెరుగుతుంది. దేశంలో క్రీడారంగాన్ని ప్రోత్సహించే దిశగా కొత్త అడుగులు పడతాయి’’ అని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఓ ప్రకటనను విడుదల చేసింది.

ఇవి తప్పక చదవండి

యూకేలో విద్యార్థి వీసా ఉల్లంఘనలపై హోమ్ ఆఫీస్ కఠిన చర్యలు

యూనైటెడ్ కింగ్‌డమ్ హోమ్ ఆఫీస్ అంతర్జాతీయ విద్యార్థులు తమ వీసా గడువు ముగిసిన తర్వాత చట్టవిరుద్ధంగా దేశంలో ఉండటం, ముఖ్యంగా ఆశ్రయం కోరడంపై కఠిన చర్యలతో ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. దాదాపు...

ఇంగ్లాండ్‌లోని Skelmersdale లో జైలు అధికారి హత్య కేసులో దోషికి 45 ఏళ్ల జైలు శిక్ష

ఇంగ్లాండ్‌లోని స్కెల్మెర్స్‌డేల్‌లో జైలు అధికారి లెన్నీ స్కాట్‌ను హత్య చేసిన కేసులో ఎలియాస్ మోర్గాన్ (35) అనే సాయుధ దోపిడీ నేరస్థుడికి 45 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. 2024 ఫిబ్రవరి 8న...

యూకేలో 16 ఏళ్లలోపు వారికి ఎనర్జీ డ్రింక్స్ నిషేధం

యూనైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వం ఇంగ్లండ్‌లో 16 ఏళ్లలోపు వారికి 150 మి.గ్రా./లీటర్ కంటే ఎక్కువ కెఫీన్ ఉన్న ఎనర్జీ డ్రింక్స్ (రెడ్ బుల్, మాన్స్టర్, ప్రైమ్ వంటివి) విక్రయాలను నిషేధించాలని ప్రతిపాదించింది. ఈ...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు