Monday, 2 March 2026

అవసరం అయితే అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తా.. జేడీ వాన్స్‌ సంచలన వ్యాఖ్యలు

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ (JD Vance) సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో ఏదైనా ఊహించని పరిస్థితి తలెత్తితే తాను అధ్యక్ష (US President) బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానంటూ సంచలన కామెంట్స్‌ చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆరోగ్యంపై ఊహాగానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వాన్స్‌ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.

యూఎస్‌ఏ టుడేతో మాట్లాడిన జేడీ వాన్స్‌.. ట్రంప్‌ ఆరోగ్యంపై మాట్లాడారు. ‘అధ్యక్షుడు ట్రంప్‌ ఆరోగ్యంపై ఇటీవలే వచ్చిన కథనాలు అమెరికా ప్రజల్లో ఆందోళన రేకెత్తించాయి. అందులో వాస్తవం లేదు. ట్రంప్‌ ప్రస్తుతం ఆరోగ్యంగా, చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఆయన ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు భయంకరమైన విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. కానీ, వాటన్నింటినీ దాటుకొని తన పదవీ కాలాన్ని ట్రంప్‌ పూర్తి చేస్తారని ఆశిస్తున్నా. అమెరికా ప్రజలకు ఇంకా గొప్ప పనులు చేస్తారన్న నమ్మకం నాకు ఉంది. ఒకవేళ ఏదైనా ఊహించని పరిస్థితి తలెత్తితే అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను’ అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం జేడీ వాన్స్‌ కామెంట్స్‌ వైరల్‌ అవుతున్నాయి.

అధ్యక్షుడి ఆరోగ్యంపై ఊహాగానాలు
అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) ఆరోగ్యంపై ఇటీవలే పలు ఊహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఆయన చేతులపై కమిలిన గాయాలు కనిపించడం ఇటీవలే కలకలం రేపుతోంది. ట్రంప్‌ కుడిచేతి వెనుక భాగంలో ఓ తెల్లటి మార్క్‌ కనిపించింది. సోమవారం ఓవెల్‌ ఆఫీస్‌ (Oval Office)లో జరిగిన సమావేశం సందర్భంగా అది కెమెరాకు చిక్కింది. దీంతో ట్రంప్‌ ఆరోగ్యంపై ఆందోళన రేకెత్తించింది. ఇది చూసిన ట్రంప్‌ మద్దతుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్‌ వింత వ్యాధితో బాధపడుతున్నారంటూ వదంతులు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇటీవలే ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఇమ్మానుయెల్‌ మాక్రాన్‌తో భేటీ సందర్భంగా ట్రంప్‌ చేతిపై కమిలిన గాయాలు కనిపించాయి. ఆ తర్వాత న్యూజెర్సీలో జరిగిన ఫిపా క్లబ్‌ వరల్డ్‌ కప్‌ తిలకించేందుకు వచ్చిన ట్రంప్‌ కాస్త అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కనిపించారు. కాళ్ల వద్ద నరాలు ఉబ్బిపోయినట్లుగా, కుడి చేతిపై పలు చోట్ల వాపు ఉన్నట్లు కెమెరా కంట పడింది. ఇప్పుడు మరోసారి ట్రంప్‌ కుడి అరచేతి వెనుక భాగంలో ఇలాంటి గాయాలే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఆ కమిలిన గాయాన్ని దాచేందుకు అధ్యక్షుడు మేకప్‌తో కవర్‌ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన దృష్యాలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు