Tuesday, 17 March 2026

ఆంధ్ర ప్రదేశ్ సీఎం హెలికాప్టర్ మార్పు

సీఎం చంద్రబాబుతో పాటు ఇతర వీవీఐపీలు ప్రయాణించే హెలికాప్టర్‌లో తరచూ సాంకేతిక లోపాలు తలెత్తడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భద్రతా కారణాల దృష్ట్యా ఇప్పటివరకు వినియోగిస్తున్న బెల్ కంపెనీ చాపర్‌ను పక్కనపెట్టి, దాని స్థానంలో అధునాతన ఎయిర్‌బస్ హెచ్ 160 హెలికాప్టర్‌ను అద్దె ప్రాతిపదికన వినియోగంలోకి తెచ్చింది.

గత కొంతకాలంగా సీఎం పర్యటనల కోసం వాడుతున్న బెల్ హెలికాప్టర్‌లో పలుమార్లు సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. టేకాఫ్ కోసం ఎక్కువ సమయం తీసుకోవడం, సాంకేతిక మొరాయింపు వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. గతంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు ఇదే హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. తిరుపతి నుంచి కృష్ణపట్నం పోర్టుకు వెళ్లాల్సిన ఆయన, చాపర్ మొరాయించడంతో తన పర్యటనను రద్దు చేసుకోవాల్సి వచ్చింది.

ఈ వరుస ఘటనల నేపథ్యంలో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఈ హెలికాప్టర్ వినియోగం సురక్షితం కాదని, దాని స్థానంలో మెరుగైన దానిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. వారి సూచన మేరకు ప్రభుత్వం కొత్త ఎయిర్‌బస్ హెచ్ 160 చాపర్‌ను అద్దెకు తీసుకుంది. ఈ కొత్త హెలికాప్టర్ గతంలో వాడిన దానికంటే సాంకేతికంగా చాలా అధునాతనమైనది. రాష్ట్రంలోని ఏ మారుమూల ప్రాంతానికైనా నేరుగా ప్రయాణించే సామర్థ్యం దీనికి ఉంది. భద్రతా ప్రమాణాల పరంగా కూడా ఇది ఎంతో మెరుగైనదని నిపుణులు చెబుతున్నారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు