Saturday, 21 March 2026

రాష్ట్రవ్యాప్తంగా రాహుల్ గాంధీ దిష్టిబొమ్మలు తగలబెడతామన్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీ తల్లిని ఉద్దేశించి రాహుల్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ, ఆయన నైతికంగా పూర్తిగా దిగజారారని మండిపడ్డారు. రాహుల్ పిచ్చి పరాకాష్ఠకు చేరిందని, అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. కాసపటి క్రితం రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన మాధవ్, రాహుల్ గాంధీని తరిమికొడతామని హెచ్చరించారు. ప్రధాని తల్లిపై రాహుల్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఆయన దిష్టిబొమ్మలను దహనం చేస్తామని మాధవ్ ప్రకటించారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గం నిర్ణయం తీసుకుందని, ఆందోళనలకు పిలుపునిచ్చిందని తెలిపారు. ఎన్నికల కమిషన్ విసిరిన సవాల్‌కు రాహుల్ గాంధీ తోకముడిచారని ఆయన ఎద్దేవా చేశారు.

ఈ సందర్భంగా మాధవ్ గోదావరి పుష్కరాల నిర్వహణపై కీలక ప్రకటన చేశారు. రాబోయే గోదావరి పుష్కరాలను కుంభమేళా స్థాయిలో అత్యంత వైభవంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపడతాయని తెలిపారు. ఇప్పటికే దీనిపై కేంద్రమంత్రి షెకావత్ అధ్యయనం చేశారని గుర్తుచేశారు. పుష్కరాల పేరుతో రాజమండ్రిలో శాశ్వత కట్టడాలకు ప్రాధాన్యత ఇస్తామని, ఇందులో భాగంగా చారిత్రక హేవ్ లాక్ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు, రాజమండ్రిలోని ఏకేసీ కాలేజ్, ఎన్టీఆర్ పార్క్ వద్ద మాధవ్ ‘చాయ్ పే చర్చ’ కార్యక్రమం నిర్వహించారు. ప్రధాని మోదీ పాలనపై ప్రజాభిప్రాయ సేకరణ కోసమే ఈ కార్యక్రమం చేపట్టామని ఆయన అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజల నుంచి ఊహించని రీతిలో మద్దతు లభిస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు