Tuesday, 17 March 2026

త్వరలో APPSC ఇరవై నోటిఫికేషన్ల జారీ

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఏపీపీఎస్సీ (APPSC) తాజాగా శుభవార్తను తెలియజేసింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న సుమారు 80 పోస్టుల భర్తీకి సంబంధించిన 20 నోటిఫికేషన్లు త్వరలో విడుదల కానున్నాయని కమిషన్ కార్యదర్శి పి. రాజాబాబు వెల్లడించారు. విజయవాడలో ఏపీపీఎస్సీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రాజాబాబు మాట్లాడుతూ, పోస్టుల సంఖ్య తక్కువగా ఉన్నందున అన్ని నోటిఫికేషన్లను కలిపి ఒకే ఉమ్మడి పరీక్ష నిర్వహించే దిశగా ఆలోచనలు చేస్తున్నామని తెలిపారు. ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్లు విడుదల చేసేలా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

వేలాది మంది అభ్యర్థులు ఆశగా ఎదురుచూస్తున్న గ్రూప్-1, గ్రూప్-2 ఫలితాల విడుదల జాప్యంపై కూడా స్పష్టత ఇచ్చారు. స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు సంబంధించిన తుది జాబితా ఇంకా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (SAAP) నుంచి రాకపోవడం వల్లే ఫలితాలు విడుదల ఆలస్యం అవుతున్నాయని రాజాబాబు తెలిపారు. జాబితా అందిన వెంటనే ఫలితాలు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. గ్రూప్-2 పరీక్షలలో ఎంపికైన అభ్యర్థుల వైద్య పరీక్షల ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఇప్పటికీ 1,634 మంది అభ్యర్థుల కంటిచూపు నివేదికలు, 24 మంది అభ్యర్థుల వినికిడి పరీక్షల నివేదికలు రావాల్సి ఉందని పేర్కొన్నారు. ఫలితాలపై సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని అభ్యర్థులకు సూచించారు.

అటవీ శాఖ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం సెప్టెంబర్ 7న స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఈ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 287 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పరీక్షల సమయంలో అభ్యర్థులు ఓఎంఆర్ షీట్‌పై వివరాలను పూర్తిగా, స్పష్టంగా నింపాలని, వైట్‌నర్ ఉపయోగించడం లేదా సమాధానాలను చెరిపివేయడం వల్ల ఆ షీట్లు తిరస్కరించబడతాయని రాజాబాబు హెచ్చరించారు. ప్రశ్నలకు తప్పు సమాధానాలిచ్చినందుకు ప్రతీ మూడు తప్పులకు ఒక నెగటివ్ మార్కు విధించబడుతుందని కూడా స్పష్టం చేశారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు