దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన సీఎంలలో చంద్రబాబు మూడో స్థానం దక్కించుకున్నారు. దేశంలోని 28 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలి ప్రాంతాల సీఎంల పనితీరుపై ‘ఇండియా టుడే’ సర్వే నిర్వహించింది. ‘మూడ్ ఆఫ్ ద నేషన్’ పేరిట నిర్వహించిన ఈ సర్వేలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ 36 శాతం జనామోదతంతో ప్రథమ స్థానంలో నిలిస్తే.. 12.5 శాతంతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ద్వితీయ స్థానంలో నిలిచారు. అలాగే చంద్రబాబు 7.3 శాతం జనామోదతంతో మూడో స్థానంలో ఉన్నారు.
బిహార్ సీఎం (4.3 శాతం), తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ (3.8 శాతం) వరుసగా నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచారు. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన ఇదే సర్వేలో చంద్రబాబు ఐదో స్థానంలో ఉన్నారు. ఇక, ‘ఇండియా టుడే’ 2001 నుంచి ఏడాది రెండు సార్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై ‘మూడ్ ఆఫ్ ద నేషన్’ పేరిట సర్వే నిర్వహిస్తూ ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటోంది.